"వినాశకాలే విపరీత బుద్ది" అన్నారు పెద్దలు. వినాశకాలం దరికి వస్తుండగానే వ్యక్తులకు విపరీత బుద్ధులు దాపురిస్తాయని అంటున్నారు చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకులు సీఎస్ రంగరాజన్ కూడా అదేమాటే అన్నారు. చంద్రబాబుది విపరీత బుద్ధి అని ఆయన అంటున్నారు. అంటే బాబుకు రాజకీయంగా పోగాలం దాపురించింది అన్నమాటే. అందునా ఆ శ్రీవేంకటేశ్వరుని పాదపద్మాల కడ పడి ఉండి పూజలు చేసుకోవటం తప్ప వాళ్ళు చెసే పెద్ద రాజకీయాలు ఏముంటాయి? మహా ఐతే నలుగురు ప్రముఖులకు ఆశీర్వచనాలిచ్చి సంభావన పుచ్చుకుంటారు. అది బ్రాహ్మణులకు అదీ పూజాధికాలు నిర్వహించే వారికి ఆ భగవానుడు ఇచ్చిన అవకాశం. 
TTD wrong appointments in palaka mandali కోసం చిత్ర ఫలితం

TTD wrong appointments in palaka mandali కోసం చిత్ర ఫలితం

ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వ తమ పట్ల వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఆయన విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ప్రతీకార ధోరణితో స్పందిస్తుండటం మనకు కనిపిస్తూనే ఉంది. రమణ దీక్షితులు గతంలో తప్పులు చేశారనేది టిటిడి పాలకమండలి సభ్యుల వదన. ఆయన గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు చర్యలు తీసుకుంటారా? నాడు వీళ్ళేం చేసి ఉంటారు?  ఇక రమణ దీక్షితులుకు కూడా చంద్రబాబు మంత్రులు రాజకీయాలను ఆపాదిస్తుండటం గమనార్హం.
TTD wrong appointments in palaka mandali కోసం చిత్ర ఫలితం
రమణ దీక్షితులు ప్రతిపక్షానికి దగ్గరివాడనేది టీడీపీ వాళ్ళ ఉవాచ. ఈ అంశాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని టిడిపి నిర్ణయించుకోవటం స్పష్టం అవుతోంది. రమణ దీక్షితులు వెనుక ఏవరో తెలుగుదేశం శత్రువులున్నారని, గతంలోనూ హిందూ పీఠాధిపతులు చంద్రబాబు విషయంలో ఆగ్రహం వ్యక్తంచేస్తే, అప్పుడు కూడా వాళ్లకూ రాజకీయాలను ఆపాదించారు.
TTD wrong appointments in palaka mandali కోసం చిత్ర ఫలితం
ఇప్పుడు రమణ దీక్షితులు సవాళ్ళకు జవాబు చెప్పలేక నేపం తమ రాజకీయ శత్రువుపై వేయటం చూస్తూనే ఉంటున్నమని అంటున్నారు జనం. చంద్రబాబు బృందం సనాతన ధర్మ నియమాలను మార్చేస్తూ, ఈ వ్యవహారాలకు సమాధానం చెప్పే సామర్ధ్యంలేక వెనక ఎవరో ఉండి వారిని నడిపిస్తున్నరనటం ఆ సందర్భంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పేరును తీసుకురాకుండా మాట్లాడలేని పరిస్థితిలో ఉంది తెలుగుదేశం పార్టీ. కేవలం రమణ దీక్షితులు మాత్రమే కాదు,  చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధానార్చకులు సీఎస్ రంగరాజన్ కూడా "చంద్రబాబుది విపరీత బుద్ధి" అని ఆయన అంటున్నారు.
ramana deekshitulu & rangarajan కోసం చిత్ర ఫలితం
ఏపిలో 40కి పైగా పురాతన దేవాలయాలను కూల్చేయించిన ఘనత చంద్రబాబు తెలుగుదేశానిదే నని అంటున్నారు. బహుశ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పేరును మరిపించాలనుకొని ఈ పనులు చేసి ఉంటారేమో? "అర్చక వ్యతిరేకి" అని గత కాలంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా "అర్చకుల జీతభత్యాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు సమ్మతించలేదు" అని రంగరాజన్ గుర్తుచేశారు. 
ramana deekshitulu & rangarajan కోసం చిత్ర ఫలితం
నాడు ఏపిలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో, నేడు తెలంగాణాలో కేసిఆర్ పాలనలో కుడా అర్చకుల బాగోగుల గురించి, దేవాలయాల్లో దూపదీప నైవేధ్య సేవల గురించి పట్టించుకున్నారని పట్టించుకుంటున్నారని రంగరాజన్ గుర్తుచేశారు. మొత్తానికి క్రమంగా తెలుగుదేశం పార్టీ ఫ్రస్ట్రేషణ్ తో అన్నీ వర్గాలని వరసగా శత్రువులుగా  మార్చుకుంటోంది. ఆఖరికి దేవాలయాల్లో, చిన్న చిన్న విషయాల్లో కూడా వృద్ధ పూజారుల మీద కూడా పగబట్టినట్లు ప్రవర్తించటం అంత మంచిది గాదని పెద్దలు ఆయన శ్రేయోభిలాషులు కూడా అంటున్నారు. బ్రహ్మణ ఘోష ఫలితాలు ఎలా ఉంటాయో గతం లోనే తనకు కూడా తెలుసంటున్నారు. 

Tiruma temple & ramana deekshitulu కోసం చిత్ర ఫలితం

కొందరు అనుభవజ్ఞులు మాటల మద్యలో దేవాలయాలపట్ల, పూజారులపట్ల అపచారం చేసే పాలకుల పాలనలో ఆ రాజ్యం అభివృద్ధికి నోచుకోదని అపచారాలు జరుగు తుంటాయని అంటున్నారు. దేవస్థాన పాలక సభ్యుల విషయంలో కనిపిస్తున్న దుర్మార్గాలు, అర్చకులపై దౌష్ట్యాల వలననే కావచ్చు రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు, జలప్రమాదాలు ఇతరత్రా అరాచకాలు ఉదృతమౌతున్నాయని అవే ఋజువులు అంటున్నారు. 

 Tiruma temple & ramana deekshitulu కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: