ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ తన స్పీడును పెంచాడు. వీలుచిక్కినప్పుడల్లా ప్రజలలో మమేకమవుతూ వారి కష్టాలను తెలుసుకొంటూ జనసేన పార్టీని తాను ఒక్కడే ప్రజలలోకి తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లాలో తన 5 రోజుల పర్యటనను ముగించుకొని ఈ నెల 20 నుండి చేపట్టబోయే పోరాట యాత్రకు కూడా దాదాపు సిద్దమయిపోయాడు.


ఈ క్రమంలోనే ఆయన చేసిన వాఖ్యలు పలు ఆసక్తికర అంశాలకు దారి తీస్తున్నాయి. రాష్ట్రంలో తన మొదటి యాత్రకు సంబంధించి విశాఖపట్టణం చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఉంటుందని తెలియజేసాడు. ఆయన మాటలను బట్టి చూస్తే రాబోవు ఎన్నికలలో  జనసేన కీలకంగా మారనుందని పరోక్షంగా ప్రత్యర్థులకు సవాలును విసిరాడు. కర్ణాటకలో జేడీఎస్ ఎలా ప్రాధాన్యత సంతరించుకుందో ఏపీలో జనసేన కూడా అలానే తన ప్రభావాన్ని చూపిస్తుందని పవన్ విశ్వసిస్తున్నట్లు సమాచారం.


కాగా తన పోరాట యాత్ర 45 రోజుల పాటు కొనసాగుతుందని పవన్ చెప్పారు. అంతేగాక ఈ యాత్రలో అన్ని జిల్లాలను కలుపుకుంటూ వెళతామని ఆయన చెప్పారు. ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన శ్రీకాకుళం నుంచి యాత్రను మొదలుపెట్టబోతున్నట్లు చెప్పిన ఆయన ఈ ఆదివారం ఇచ్చాపురం లో అమరవీరులకు నివాళులు అర్పించిన తరువాత గంగమ్మకు పూజలు చేసి యాత్రను ప్రారంభించబోతున్నట్లు ఆయన తెలిపాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: