జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల వైసీపీ పార్టీపై విమర్శలు చేయడం తగ్గించారు. దీంతో వైసీపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం కూడా మానేశారు. ఏదైనా ఇది మంచి విషయం అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో వైసిపి.. ఒక్కప్పుడు పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు కి మద్దతు తెలుపుతున్న సమయంలో మాత్రమే తమకి శత్రువుగా భావింఛిన్నట్లు తెలుస్తుంది.  
Image may contain: 5 people, beard
దీనిని బట్టి అర్థమవుతుంది ఏమిటంటే కేవలం అవినీతికి పాల్పడే చంద్రబాబుకి మద్దతు తెలిపేవారు మాత్రమే తమకు
శత్రువు అని అర్థమవుతుంది. గతంలో పవన్ కళ్యాణ్.. ఎన్నో అవినీతి కార్యక్రమాలకు పాల్పడే చంద్రబాబుని పొగడ్తల వర్షంలో ముంచెత్తేవారు. అయితే ఏమైందో ఏమో కానీ ఈమధ్య చంద్రబాబుని పొగడటం ప్రశంసించడం మానేసి ప్రశ్నించడం మొదలుపెట్టారు.
Image may contain: 6 people, beard
అయితే తాజాగా తాను మొదలుపెట్టే బస్సు యాత్రలో భాగంగా కర్ణాటక ఎన్నికల క్రమంలో ఎమ్మెల్యేలను బిజెపి పార్టీ కొనుగోలు చేసే విషయంలో సంచలన కామెంట్లు చేశాడు. ఎమ్మెల్యేల ఫిరాయింపు పర్వంలో ప్రతి పార్టీ కూడా భాగస్వామ్యే అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చాడు. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ వ్యవహారంపై స్పందిస్తూ పవన్ కల్యాణ్ ఇలా మాట్లాడాడు. బీజేపీ మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు కూడా ఈ పని చేశాయని పవన్ చెప్పుకొచ్చాడు.
Image may contain: 2 people, beard
ఈ వ్యాఖ్యలు బట్టి పవన్ కళ్యాణ్ కి రాజకీయాల మీద ఎంత అవగాహన ఉందో అర్థమవుతుంది..ఇప్పటివరకు వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకునే విషయంలో నైతిక విలువలను పాటిస్తూనే వచ్చారు..ఎక్కడా కూడా ఫిరాయింపు చర్యలకు పాల్పడలేదు. అలాగే తాను కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చే సమయంలో కూడా రాజీనామా చేసి వచ్చి గెలిచి తానేంటో నిరూపించుకున్నాడు. ఇటువంటి పార్టీ మీద పవన్ కళ్యాణ్ అర్ధరహితంగా వ్యాఖ్యలు చేయడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: