కర్ణాటక రాష్ట్రంలో అధికారం కోసం భారతీయ జనతా పార్టీ వ్యవహరించిన తీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేసిన కామెంట్లు విని రాజకీయ నాయకులు నవ్వుతున్నారు. ఇంతకీ చంద్రబాబు ఏమన్నారంటే కర్ణాటక రాష్ట్రంలో బిజెపి పార్టీ రాజ్యాంగాన్ని అవమానపరిచి గవర్నర్ వ్యవస్థను తమకు అనుకూలంగా మలచుకుంది అని.. దీంతో బిజెపి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related image

ఈ నేపథ్యంలో కొందరు ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు మరి ఒక పార్టీ గుర్తుపై గెలిచి ఎమ్మెల్యేలుగా ఉన్నవారిని రాజీనామా చేయించకుండా తెలుగుదేశంలోకి తీసుకోవడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం కాదా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా దీన్ని ఏమంటారు అంటూ ప్రశ్నించారు ...అంతేకాకుండా ఒక పార్టీపై గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం ఏమిటి అంటూ ప్రశ్నించారు.

Image result for chandrababu

ఇదంతా చూస్తుంటే చంద్రబాబు ఎవరికో పుట్టిన పిల్లలకు తను పేర్లు పెట్టుకున్నట్టుగా ఉంది అని అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో చంద్రబాబు భజన చేయించుకొంటూ.. అదే తన రాజకీయ విజయయాత్ర అని చెప్పుకున్నప్పుడు ఈ విలువలు ఏమైనాయి అని అంటున్నారు. గవర్నర్ వ్యవస్థ గురించి ప్రశ్నిస్తున్న చంద్రబాబు గతంలో ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాష్ట్రంలో గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించడాన్ని ఏమంటారు అది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా అని అన్నారు.

Related image

తాను మాత్రం ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించకుండా తన పార్టీలో చేర్చుకోవచ్చు ..అదే బీజేపీ చేస్తే చంద్రబాబులో నిద్రపోతున్న గాంధీతాత లేచొస్తాడ అని అంటున్నారు. ప్రస్తుతం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే తాను చేస్తే ఆచారం ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా ఉంది అని పేర్కొన్నారు. మరోపక్క సొంత పార్టీ నేతలు కూడా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు తమలో తాము నవ్వుకుంటున్నారట.



మరింత సమాచారం తెలుసుకోండి: