ఈ దేశం దురదృష్టమేమితో గాని ఎవడుబడితే వాడు, ఎలాబడితే అలా,  మనుషుల్ని మనసుల్ని చివరకు పంచ భూతాల్ని,  తమకు తోచినట్లు విడగొట్టోచ్చు. ఇలాంటి విభజనకు, పునర్విభజనకు,  విభజన పరంపరలకు అనుకూలమైన ప్రాంతం ప్రపంచంలో ఎక్కడాలేదేమో?  అన్నీ రాజకీయ పక్షాలు ఒక్క దానికి కూడా ఇందులో మినహాయింపు ఇవ్వక్కరలేదు.  అన్నీ ఒకే తాను ముక్కలు. వీటి నేత, కలబోత అంతా ఒక్కటే. ప్రతి రాజకీయ నాయకుడూ దాదాపు అన్నీ రాజకీయ పక్షాలను చుట్టివచ్చిన వాడే.  ఒకే పక్షంతో సంబంధం ఉండి, నిలకడగా సిద్ధాంతాలతో పెనవేసుకున్న రాజకీయ నాయకులు చాలా అరుదు. 
siddaramayya paramesvara కోసం చిత్ర ఫలితం
నిన్నటి వరకు కాంగ్రెస్ లో ఉన్న వాడు నేడు పార్టీ మారి, కాంగ్రెస్ను నేఱ పార్టీగా తిట్టేస్తాడు. నిన్నటి వరకు ఆ పార్టీతో అంటకాగి పార్టీ మారగానే పునీతుడైనట్లు ప్రవర్తిస్థాడు. ఈ విభజనల మూలాలు బ్రిటీష్ వారి నుండి కాంగ్రెస్ కు రాగా,  ఆ కాన్సర్ మొత్తం రాజకీయాలకే అంటించింది కాంగ్రెస్. కాంగ్రెస్ ఒక మాహాభారతం లాంటిది. ప్రపంచంలో ఉన్న కల్మషం, కలుషితం అంతా కాంగ్రెస్ కాసారంలో ఉంది ప్రవహిస్తూ ఉంటుంది. అదే దేశంలోని అన్నీ పార్టీలలోకి ప్రవహిస్తుంది. అదే కుల పాచికలు బిజెపి అంది పుచ్చుకుంది.     
siddaramayya paramesvara కోసం చిత్ర ఫలితం
ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన పద్దతిలోనే కర్ణాటకలోనూ  బీజేపీ కుల పాచిక  పారేలా కనిపిస్తోంది. కులాల ప్రాతిపదికగా ఎమ్మెల్యేలకు ప్రయోజనాలు ఎర చూపుతూ బీజేపీ  లింగాయత్‌ అస్త్రం  ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ దూకుడు పెంచడంతో  కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి మధ్య సఖ్యత కొరవడుతున్నట్లు తెలు స్తోంది. కాంగ్రెస్ పార్లమెంటరి పార్టీ (సీఎల్పీ) భేటీకి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కొందరు డుమ్మా కొట్టడంతో జేడీఎస్‌ నేత, కూటమి ప్రధాన లబ్ధిదారుడు వారి సంయుక్త ముఖ్యమంత్రి అభ్యర్థి కుమారస్వామి సీరియస్‌గా ఉన్నారు. 
siddaramayya paramesvara కోసం చిత్ర ఫలితం
హైదరాబాద్  తాజ్‌కృష్ణ హోటల్‌ లో కర్ణాటక సీఎల్పీ సమావేశం తర్వాత కాంగ్రెస్‌ అధిష్టానంతో మాట్లాడిన కుమారస్వామి తీవ్ర అసంతృప్తితో తాజ్‌కృష్ణ నుండి నోవాటెల్‌ హోటల్‌ కు అలిగి వెళ్లిపోయారు. మీ ఎమ్మెల్యేలను మీరే కాపాడుకోలేక పోతున్నారంటూ పెదవి విరిచారు. జాగ్రత్తగా ఉంటే మంచిదంటూ సిద్దరామయ్య  పరమేశ్వర లకు సూచించారు. నోవాటెల్‌ లో జేడీఎస్‌ ఎమ్మెల్యేలతో కుమారస్వామి భేటీ కానున్నారు. అయినా మన బంగారం మంచిదైతే స్వర్ణకారులు ఏమిచేయలేరు. ఎవరికి సిద్ధాంతాలు పట్టవు. అవకాశాలు అవసరాలే ముఖ్యం. ఇప్పుడు కుమారస్వామి అంతేకదా? గతంలో కుమారస్వామితో దరంసింగ్ కాలంలో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ కు సిగ్గులేదు. మళ్ళా  ఒక మైనారిటి పార్టీ ప్రతినిధికి అధికారం ఇవ్వజూబితే మిగిలినోళ్ళంతా పిచ్చోళ్ళా? మూసుకొని ఉండటానికి? అని ప్రశ్నలు సంధిస్తున్నారు ఎమెల్యేలు.
siddaramayya paramesvara కోసం చిత్ర ఫలితం
కాంగ్రెస్‌లోని 8మంది లింగాయత్‌ ఎమ్మెల్యేలను బీజేపీ ఆకర్షించేయత్నం చేయడం కారణంగా, తాజ్‌కృష్ణలో జరిగిన సీఎల్పీ భేటీలో వీరి నుంచి సమావేశంలో వ్యతిరేకత వచ్చింది. మరోవైపు సీఎల్పీ భేటీకి ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా డుమ్మా కొట్టడం గమనార్హం. వీరిలో రాయచూర్‌ జిల్లా మక్కి ఎమ్మెల్యే ప్రతాఫ్‌ గౌడ, బళ్లారి జిల్లా హోస్‌పేట్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ సింగ్‌ ఉన్నారు. దీంతో బీజేపీ తమ నేతలను ప్రలోభాలకు గురిచేసిందంటూ కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఇతర నేతలపై కాంగ్రెస్‌ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించే పరిస్థితి నెలకొంది.
siddaramayya paramesvara కోసం చిత్ర ఫలితం
ఇదంతా చూస్తుంటే యెడ్డీ ఆత్మవిశ్వాసానికి అర్ధం ఉందని పిస్తుంది. ఐయితే దీనికి ఏవరిని నిందించి ఏంలాభం? అన్నీ అనర్ధాలకు మూలకారణం కాంగ్రెస్ - ఇప్పటి వరకు కాంగ్రెస్ కుతంత్రాలను ఆస్థాయిలో ప్రదర్సించిన పార్తీ పోటీలో లేకపోవటం తో ఏడు దశాబ్ధాలు ఎదురులేకుండా ఏలిందీ దేశాన్ని. ఇప్పుడు అదే గుణగణాలు బిజెపి సంతరించుకోవటంతో కాంగ్రెస్-జెడిఎస్ లు తమతో తాము మండిపోతున్నాయి.
jds kumara congress dharam singh కోసం చిత్ర ఫలితం
ఆఖరకు లింగాయత్ లను మైనారిటి గా అంటే "ఇంకోమతం" గా పుట్టించిన కర్ణాటక శాసనసభలో చట్టం చేయటానికి ఆమోదించిందీ కాంగ్రెసే కాదా! అందుకే అంటారు "నీవు నేఱ్పిన విద్యయే నీరజాక్షా!" అని. 
jds kumara congress dharam singh కోసం చిత్ర ఫలితం
అయితే విచిత్రమేమిటంటే ఈ సర్వానర్ధాలకు కారణం మూలం, నిలయం ఐన కాంగ్రెస్ ను వదిలేసి ఆసేతు శీతాచలం భారత్ నేడు బిజెపిని తిట్టటం న్యాయమా? ఒక్కడూ కాంగ్రెస్ ను ప్రశ్నించడేమిటి?  
అదే అంటే చరిత్ర త్రవ్వకు అంటారు. ఉన్నదంతా చరిత్రే. దాంతోనే అన్నీ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఆఖరుకు ఒక డాక్టర్ దగ్గరకు చికిత్సకు వెళితే జబ్బు పూర్వాపరాలు అంటే చరిత్ర అడుగుతారు. చరిత్ర మరచిపోయేది కాదు! చించెస్తే చిరిగి పోయేది కాదు! దట్స్ ఆల్.

jds kumara congress dharam singh కోసం చిత్ర ఫలితం 
ఈ దేశంలో ఉన్న రాజకీయ పక్షాలపై, రాజకీయులపై నిషేధం విధించి కొత్త రక్తంతో నూతన పక్షం ఆవిర్భవిస్తే తప్ప దీనికి పరిష్కారం దొరకదు. బిజెపిని ప్రశ్నిద్దామంటే వాళ్ళు 1947 కాలం నుండి అంటే దేశ విభజన కాలం నుండి కాంగ్రెస్ నిర్వాకలను ఎకరువు పెడుతున్నారు. అసలు సర్వానర్ధాలకు నిలయం కాంగ్రెస్. దాన్నందుకే "మహాత్మా గాంధి రద్ధు చేయాలనుకున్నారు. ఆయనకు చేతకాని పని నరెంద్ర మోడీ " చేస్తున్నారనవచ్చు.  

jds kumara congress dharam singh కోసం చిత్ర ఫలితం

అదే కాంగ్రెస్ ముక్త భారత్. కొన్ని సార్లు పాప ఫంకిలాన్ని వదిలించుకోవాలంటే శస్త్ర చికిత్స అవసరం. అంటే కాసేపు సిద్ధాంత వైరుద్యాలను మరచి నిష్కర్షగా చేయాల్సి న పని చెస్తేనే అన్నీ కరక్ట్ అవుతాయి. లెట్ మోడి ఫినిష్ ఇట్! ప్రజలు అధర్మం అనక్కరలేదు. మనకు నష్టంలేదు. ఏ నాయకుడైనా మనకు ఇచ్చెదేమీ లేదు. సిద్ధాంతా ల ముసుగులో కుమారస్వామి లాంటి చారిత్రాత్మక దోషి, ఆయనకు తమ అవసరానికి (అంటే బిజెపిని అధికారంలోకి రాకుండా చేయటానికి చేసే ప్రయత్నం) మద్దతు ఇచ్చే ఈ కాంగ్రెస్ సఖ్యత ఎంతకాలం ఉంటుంది? 

narendra modi mahatma gandhi కోసం చిత్ర ఫలితం   

మరింత సమాచారం తెలుసుకోండి: