కర్ణాటకలో రాజకీయాలు ఎప్పుడు లేనంత హాట్ గా మారినాయి. ఈ రోజు నాలుగు గంటలకు బీజేపీ ని బాల నిరూపణ చేసుకోమని సుప్రీం కోర్ట్ తీర్పు ఇవ్వడం తో ఏం జరగబోతుందని అందరు సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం విశ్వాస తీర్మానం లో నెగ్గక పోయిన, కాంగ్రెస్ అండ్ జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని నడిపేది కష్ట మైన పనిగా కనిపిస్తుంది.  ఎందుకంటే సీఎం కుర్చీ లో కుమారస్వామి ని కూర్చో పెడితే, మంత్రుల పదవుల కోసం ఇప్పటికే చాలా మంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. 

Image result for karnataka parties

బీజేపీ ప్రభుత్వం బల నిరూపణ లో విఫలమైతే, యడ్యూరప్ప ప్రభుత్వం కూలుతుంది. అయితే ఆ తర్వాత ఏం జరుగుతుంది? జేడీఎస్ కుమారస్వామిని సీఎంగా కూర్చోబెట్టి గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తాడా? ఒకవేళ చేయించాల్సి వచ్చినా.. ఆ తర్వాత కుమారస్వామి బలనిరూపణ సాధ్యం అవుతుందా? అప్పటి వరకూ బీజేపీ చూస్తూ కూర్చుంటుందా? ఒకవేళ సీఎం సీటు తమకే దక్కని పక్షంలో బీజేపీ వాళ్లు కుమారస్వామికి దక్కనిస్తారా? అనే విషయాలు ప్రశ్నార్థకమే.

Image result for karnataka parties

అందులోనూ జేడీఎస్, కాంగ్రెస్‌లు పైకి అయితే బాగానే కనిపిస్తున్నాయి. కానీ.. కుమారస్వామి సీట్లో కూర్చుని.. మంత్రి వర్గం ఏర్పాటు చేస్తే అప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఇప్పటికే అక్కడ డిప్యూటీ సీఎం హోదా ఆశావహులు చాలా మంది కనిపిస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు చేజారకుండా డీల్స్ మాట్లాడుతున్న డీకే శివకుమార వంటి వాళ్ల చూపు డిప్యూటీ సీఎం పీఠంపై ఉంది. రేపు యడ్యూరప్ప సీఎంగా కూర్చోలేకపోతే కర్ణాటక రాష్ట్రపతి పాలనకు సిద్ధంగా ఉండాలేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: