భారత దేశంలో ప్రదానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి బీజేపీ శ్రేణులకు బలం వెయ్యి రెట్లు ఎక్కువైనట్లుగా భావిస్తున్నారు.  దేశం వ్యాప్తంగా బీజేపీ నేతలు కొంత కాలంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తెగ హల్ చల్ చేస్తున్నారు.  తాజాగా భారతీయులందరూ అవినీతి పరులేనని, వారి రక్తంలోనే అవినీతి ఉందంటూ యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్‌ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్భర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దేశంలోని వంద కోట్ల పై చిలుకు జనాభాలోనూ అవినీతి ఉందని, దీనిని ప్రక్షాళన చేయడం అంత సులువు కాదని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ఓ వైపు తాము దేశభక్తులం అని..దేశంలో అన్యాయాలు సహించభోమని..భారత దేశంలో ప్రతిఒక్కరూ దేశభక్తులని ఉపన్యాసాలు ఇస్తుంటారు..కానీ  ఓం ప్రకాశ్ రాజ్భర్  దేశంలో ఉన్నవారంతా అవినీతి పరులే అని అనడం పై పలువురు తీవ్రంగా స్పందిస్తున్నారు.

ఢిల్లీ, గుజరాత్, ఏపీ, కేరళతో పోల్చుకుంటే ఉత్తరప్రదేశ్‌లో నేరాల శాతం కూడా తక్కువేనన్నారు. దేశ ప్రధానే స్వయంగా అవినీతి అంతానికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. అక్కడితో ఆగని మంత్రి రాజ్భర్ ముఖ్యమంత్రి తన వివేకంతో పనిచేయడం లేదని, అధికారులు చెప్పినట్టు ఆయన రాష్ట్రాన్ని పాలిస్తున్నారంటూ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. మరి ఆ అవినీతి పరుల్లో ఈయన కూడా ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: