జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు, వెల్ల‌డిస్తున్న వ్యాఖ్య‌లు అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తున్నాయి. మ‌రో ఏడాదిలోనే ఎన్నిక‌లు పెట్టుకుని ఆయ‌న చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల్లో ఊపు తెస్తున్నా.. విశ్లేష‌కుల‌కు మాత్రం విస్మ‌యాన్ని క‌లిగిస్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ప‌వ‌న్ రాష్ట్ర వ్యాప్తంగా రాజ‌కీయ బ‌స్సు యాత్ర చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న ప‌ర్య‌ట‌న‌ను కూడా రేప‌టి నుంచి ప్రారంభించ‌నున్నాడు. సుమారు 45 రోజుల పాటు ఈ బస్సు యాత్ర షెడ్యూలును పవన్ వెల్లడించారు.  శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి మొద‌ల‌య్యే యాత్ర ఉత్త‌రాంధ్ర‌లోనే 45 రోజులు సాగుతుంది. 

అవకాశమిస్తే బాధ్యతాయుతమైన ప్రభుత్వం

అంటే దాదాపు ఇది ఎన్నిక‌ల యాత్ర‌నే త‌ల‌పించ‌నుంద‌నేది వాస్త‌వం. ఉత్త‌రాంధ్ర‌లో 45 రోజులు, కోస్తాలో మ‌రో 45 రోజులు సీమ‌కు 45 రోజులు కేటాయిస్తే.. అంటే నాలుగున్న‌ర నెల‌ల స‌మ‌యం కేటాయిస్తే.. ఇక, ఎన్నిక‌ల‌కు నాలుగు నెల‌ల స‌మ‌య‌మే మిగిలి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ప‌వ‌న్ ప్రారంభించిన యాత్ర‌ల‌ను ఎన్నిక‌ల‌కోణంలోనే చూడాల్సి ఉంటుంది. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప‌వ‌న్ త‌న నేత‌ల‌ను నిల‌బెడ‌తాన‌ని, ఎవ‌రితోనూ పొత్తు ఉండ‌ద‌ని పేర్కొన్నాడు. ఇదిలావుంటే, పవన్ సభల్లో....పవన్ ను కాబోయే సీఎం అంటూ...కార్యకర్తలు - అభిమా నులు ఇప్ప‌టికీ పిలుపునిస్తూనే ఉన్నారు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా.. అభిమానుల జోరు ఇలానే ఉంది. 

పోరాట యాత్రతో ప్రజల్లోకి

అయితే, ప‌వ‌న్ మాత్రం  సీఎం అని పిలిచినంత మాత్రాన ముఖ్యమంత్రి అయిపోనని ప‌లు సంద‌ర్భాల్లో వ్యాఖ్యానించా రు. అయితే, ఇప్పుడు మాత్రం ఆయ‌న త‌న పంథాను మార్చుకున్నారు. త‌న ప‌లుకుల్లో `అధికారం` మోతాదును చేర్చారు.  ప్రజలు తనకు అవకావమిస్తే తప్పకుండా బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని అన్నారు. వాస్త‌వానికి గ‌తంలోనే తనకు సీఎం పదవిపై వ్యామోహం లేదని చాలాసార్లు వెల్లడించిన ఆయ‌న తాజాగా ఇప్పుడు అధికారంపై వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిగా మారింది. ప్రజలు చాన్స్ ఇస్తే సర్కార్ ను ఏర్పాటు చేసేందుకు రెడీ అన్నారు. సమర్థవంతమైన పాలనను అందిస్తానని పవన్ అన్నారు. 


ప్రజా సమస్యలను అర్థం చేసుకున్న తర్వాతే ఆ పదవి చేపడతానని చెప్పారు. రాజకీయ నాయకుల స్వార్థం కోసం వారి కుటుంబాల బాగుకోసం ప్రభుత్వాలు పనిచేయకూడదని అన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వాలు పని చేయాలన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజల ఆరోగ్యాలతో  చెలగాటమాడే హక్కు ప్రభుత్వాలకు లేదని పవన్ అన్నారు. టీడీపీ - బీజేపీలు హామీలను నెరవేర్చలేక పోయినందునే తాను ప్రజల్లోకి వచ్చానని చెప్పారు. తాను సమస్య లు బాధ్యతల నుంచి దూరంగా పారిపోయే వ్యక్తిని కాదన్నారు. మొత్తంగా ప‌వ‌న్ వ్యాఖ్య‌లకు, అధికారం మాట‌ల‌కు.. ఆహా అనాలో.. అబ్బా.. అనాలో.. అబ్బో అనాలో తెలియ‌డం లేద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: