క్యూబాలో ఘోరం జరిగింది. 114 మందితో  హవానా నుంచి హెల్గెయిన్ వెళ్తున్న బ్లూ పనోరమా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం బయలుదేరిన కుప్పకూలింది.  క్యూబా విమానమొకటి హవానా విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. బ్లూ పనోరమా ఎయిర్ లైన్స్‌కి చెందిన ఈ బోయింగ్ 737 విమానం  హెల్గెయిన్ నగరం వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించినట్టు మీడియాకు సమాచారం అందింది.
cuba
స్థానిక కాలమానం ప్రకారం 12.30గంటలకు విమానం కుప్పకూలినట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో వందమంది మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విమానంలో మొత్తం 105 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నట్టు స్థానిక మీడియా పేర్కొంది.

ప్రయాణికుల్లో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారు. కాగా విమానం కూలిన ప్రదేశానికి చేరుకున్న ఫైరింజన్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.ప్రమాదం జరిగిన సమయంలో విమాన శకలాలు 20 కిలోమీటర్ల మేర ఎగిరిపడ్డాయి. మృతదేహాలను అధికారులు గుర్తించే పనిలో ఉన్నట్టు క్యూబా అధ్యక్షుడు డియాజ్ కేనల్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై  అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: