కర్ణాటక విధాన సభ కొలువుదీరింది. ఈ ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్‌ బోపయ్య సభ్యులతో ప్రమాణస్వీకార కార్యక్రమం చేపట్టారు. తొలుత ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య శాసనసభ్యునిగా ప్రమాణం చేశారు. యడ్యూరప్ప సర్కార్‌ బలనిరూపణ సాయంత్రం 4 గంటలకు జరగనుంది.సరిగ్గా ఉదయం పదకొండు గంటలకు వందేమాతరం గేయంతో కర్ణాటక అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. 


కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన బీజేపీ నేత యడ్యూరప్ప నేడు శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. దీంతో ఎలాంటి ఫలితం రానుందో అనే దానిపై ఆసక్తి నెలకొంది.  బలపరీక్ష నిరూపణ సమయం దగ్గర పడుతున్న కొద్దీ భారతీయ జనతా పార్టీలో కొత్త ధీమా కనిపిస్తోంది. 


నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం 10 నుంచి 15మంది కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారంటూ బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

బలపరీక్షలో ఎలాగైనా నెగ్గేందుకు బీజేపీ తన విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌-జేడీఎస్‌కు చెందిన పదిమంది ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకోవడం, మరోవైపు 14మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యే విధంగా చేసేందుకు పావులు కదుపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: