ఈ మద్య దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తీవ్రం అయ్యింది.  ప్రతిరోజు వందల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.  ఎంతో మంది అభాగ్యులు అంగవైకల్యులు అవుతున్నారు...పెద్ద దిక్కు కోల్పోతున్నారు.  ఓ వైపు ప్రభుత్వం రోడ్డు భద్రతా చర్యలు తీసుకుంటున్నా..కొంత మంది డ్రైవర్ల నిర్లక్ష్యం మూలంగా నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా భావనగర్‌-అహ్మదాబాద్‌ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. 

బవల్‌యాలీ గ్రామం సమీపంలో శనివారం ఉదయంసిమెంట్‌ బస్తాలు తీసుకెళ్తున్న ఓ ట్రక్కు బోల్తా పడటంతో 19 మంది దుర్మరణం చెందారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ట్రక్కు రోడ్డుపై మలుపు తిరుగుతుండగా అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. కూలీలపై సిమెంట్‌ బస్తాలు పడటంతో 19 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు.

మృతుల్లో 16 మంది కూలీలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలం చేరుకొని ఘటన వివరాలు సేకరిస్తున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రుల్లో చేర్చారు.  ప్రమాద స్థలిలో  బాధితుల ఆహాకారాలతో కంటతడి పెట్టిస్తుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: