ఎప్పుడూ లేనంతగా ఈ సారి కర్ణాటక ఎన్నికలు ఓ రేంజిలో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ముందుగా ఊహించినట్లుగానే ఎన్నికల ఫలితాలు హంగ్ తో ముగిసాయి. ఏ పార్టీకి స్వచ్ఛమైన మెజార్టీరాకపోడంతో కాంగ్రెస్, జేడీఎస్ రెండూ ఒక కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్ కు విన్నవించుకున్నా రాష్ట్రంలో అదిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీవైపే ఆయన మొగ్గుచూపడం వివాదాస్పదమయింది.


దీనిపై కాంగ్రెస్ సుప్రీంకోర్టు గడప తొక్కడంతో నేడు సాయంత్రం 4 గంటలలోపు యడ్యూరప్ప తన బలాన్ని నిరుపించుకోవాలని డెడ్ లైన్ విధించింది. కాగా ఎన్నికల తర్వాత మొదటగా నేడు జరిగిన శాసనసభ సమావేశంలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి ఇద్దరు కాంగ్రెస్ రాకుండా బెంగళూరులోని ఒక ఖరీదైన హోటల్లో తలదాచుకోవడం, వారిని తీసుకరావడానికి ఏకంగా ఐజీ స్థాయి అధికారి వారు ఉన్న హోటల్ కు వెళ్లడం వంటి హైడ్రామా నడిచింది. 


ఉదయం జరిగిన అసెంబ్లీ సమావేశంలో కాస్త గందరగోళం జరగడంతో ప్రొటెం స్పీకర్ సభను మూడున్నర కు వాయిదా వేయడం జరిగింది. సాయంత్రం సభ తిరిగి సమావేశం అవడంతో యడ్యూరప్ప భావోద్వేగ ప్రసంగం చేశారు. విశ్వాస పరీక్షను ప్రవేశపెట్టని ఆయన స్పీకర్ అనుమతితో ఇరవై నిమిషాలు మాట్లాడి తమకు ఓట్లు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. విశ్వాస పరీక్షలో తగిన బలం లేదు కాబట్టి, త్వరలొనే గవర్నర్ ను కలిసి తన రాజీనామాను సమర్పించబోతున్నట్లు చెప్పి  సంచలన విషయాన్ని ప్రకటించి ఆసెంబ్లీ నుండి నిష్క్రమించారు. విశ్వాస పరీక్షకు తగిన బలం లేక యెడ్డీ రాజీనామా చేయడం దక్షిణాదిలో పాతుకుపోవాలన్న బీజేపీ ఆశలు భంగం కావడమే. మొత్తంగా కర్ణాటకలో అత్యధికపార్టీగా అవతరించినా పాలించే విషయంలో బీజేపీ ఓడిపోయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: