Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jan 23, 2019 | Last Updated 3:44 pm IST

Menu &Sections

Search

కర్ణాటక సీఎంగా కుమారస్వామి, ముహూర్తం ఖరారు: కాబినెట్ పై లీకులు?

కర్ణాటక సీఎంగా కుమారస్వామి, ముహూర్తం ఖరారు: కాబినెట్ పై లీకులు?
కర్ణాటక సీఎంగా కుమారస్వామి, ముహూర్తం ఖరారు: కాబినెట్ పై లీకులు?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బిజెపి ముఖ్యమంత్రి మూణ్ణాళ్ళ ముచ్చట తరవాత రాజీనామా చేశారు. ఒక అనుభవఙ్జుడైన కాంగ్రెస్ రాజకీయ నాయకుని ప్రయివేట్ మాటల ప్రకారం "సింహం పదడుగులు వెనక్కి వేసిందంటే ఓడిపోయిందను కోవటం బుద్దిమాంద్యులు చెసేపని, బహుశ అది రానున్న కాలములో లఘించి బలంగా శత్రువులపై దూకి అంతం చేయటానికేనన్నది కనీసం మనసులో పెట్టుకోవాలనే ఒక నానుడి. రాజకీయ సమరాంగణంలో ఒక అడుగు వెనక్కు వేసిన తరుణం - మరో వందడుగులు దూసుకు వెళ్ళటానికే అన్నది గుర్తించాలి. అదీ నరెంద్ర మోదీ-అమిత్ షాలైతే ఇంకా చెప్పేపనిలేదు" అని అంటున్నారు. 

national-news-modi-shah-bjp-siddaramaiah-devegowda

కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మూడు రోజులకే మెజారిటీ శాసనసభ్యల మద్దతు లేదని సీఎం పదవికి రాజీనామా చేశారు బీఎస్ యడ్యూరప్ప. అయితే గవర్నర్ పిలుపు మేరకు కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి రేపు సోమవారం (21.05.2018) ముహూర్తం ఫిక్స్ అయింది. అందుకే వారిప్పు డు సంబరాలు చేసుకుంటున్నారు. 
national-news-modi-shah-bjp-siddaramaiah-devegowda
కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే తిరుగుబాటు దారులకు చుక్కలు చూపించటానికి రంగం సిద్దం చేశారని తెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పాటులో వైఫల్యం చెంది ప్రశాంతత పొందింది బిజేపి. అయితే కర్ణాటకలో మంత్రివర్గం ఏర్పాటు చెయ్యడం కాంగ్రెస్-జేడీఎస్ లకు పెద్ద తలనొప్పి మొదలైనట్లే. ఇప్పటికే కాంగ్రెస్-జేడీఎస్ సీనియర్ ఎమ్మెల్యేల మంత్రి పదవులు ఇవే అంటూ సోషల్ మీడియా లో మంత్రివర్గ కూర్పుతో వైరల్ అయ్యింది.
national-news-modi-shah-bjp-siddaramaiah-devegowda
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మళ్లీ మంత్రి పదవి చేపట్టే అవకాశం ఏపరిస్థితుల్లో లేదని అంటున్నారు. ఇక జేడీఎస్ మీద తిరుగుబాటు చేసి మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ, కుమారస్వామి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరిన జమీర్ అహమ్మద్ తదితర ఎమ్మెల్యేలలో ఒక్కరికీ కూడా మంత్రి పదవి వచ్చే అవకాశం లేదు.

national-news-modi-shah-bjp-siddaramaiah-devegowda
హెచ్.డి. కుమారస్వామి సీఎం అయన తరువాత జేడీఎస్ మీద తిరుబాటుచేసి కాంగ్రెస్ లో చేరిన నాయకులకు ముసళ్ళ పండగ మొదలవటం తథ్యం అనేది ఇప్పుడు అందిన  సమాచారం. ఇప్పటికే హెచ్.డి. కుమారస్వామి మీద తిరుగుబాటు చేసి కాంగ్రెస్ లో చేరిన నాయకులు తమకు కాలం మూడిందని హడలిపోతున్నారు. 
national-news-modi-shah-bjp-siddaramaiah-devegowda
మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ, హెచ్ డి. కుమారస్వామికి నమ్మకంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు చాముండేశ్వరిలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఓడించిన జీటీ దేవేగౌడకు మంత్రి పదవులు పువ్వుల్లో పెట్తి ఇస్తారని సమాచారం. ఇక గతంలోనూ, ఎన్నికల ముందు జేడీఎస్ నుంచి బయటకు వచ్చి సిద్దరామయ్య కు సన్నిహితంగా ఉన్న నాయకులకు మంత్రి పదవులు వచ్చే అవకాశం లేదని జేడీఎస్ వర్గాలు ఇప్పటికే అంటున్నాయి.

national-news-modi-shah-bjp-siddaramaiah-devegowda

అయితే కక్ష తీర్చుకునే సహజ గుణమున్న జెడిఎస్ గౌడ కుటుంబం అప్పుడే తన సహజ శైలిలో రాజకీయాలు ప్రారంభించినట్లు ఇప్పటికే అంతర్జాలం నిండా వార్తలు వస్తున్నాయి. అంతే కాదు గౌడ కుటుంబానికి ఆగర్భ శత్రువులైన మరో సామాజిక వర్గం సమయం కోసం మాటువేయసే ఉంది. అంతే కాదు సిద్దరామయ్య లాంటి వ్యూహ చతురుడు గౌడ లీలలు చూస్తూ ఊర్కోలేడని కూడా బంగళూరులో ప్రచారంలో ఉంది. 

national-news-modi-shah-bjp-siddaramaiah-devegowda  

national-news-modi-shah-bjp-siddaramaiah-devegowda
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
"దగా! దగా! కుట్ర" పాటపై పిఠాపురంఎమెల్యే ప్రజా ప్రయోజన వ్యాజ్యం - 3 వారాలకు వాయిదా: హైకోర్ట్
రాజకీయాల్లో రూటు మార్చిన వైఎస్ జగన్? మున్ముందు బాబుకు దెబ్బే!
డేరింగ్ & డాషింగ్ లో మహెష్ బాబు కృష్ణతో పోటీ పడలేడా!
టిడిపి కొంప ముంచనున్న చంద్రబాబు తుగ్లక్ నిర్ణయం! 20% ఓట్లు గల్లంతు
ట్రంప్ హయాంలో సైతం రెపరెపలాడుతున్న భారత యువత కీర్తి పతాకం
బాన పొట్టను తేలికగా తగ్గించుకోండి ఇలా?
చంద్రబాబు దర్శకత్వంలో ఏర్పడ్డ  'కర్ణాటక సంకీర్ణం'  చట్టు బండలు కానుందా?
ఏపి ప్రభుత్వానికి హైకోర్ట్ ఝలక్ - కొడి కత్తి కేసు విచారణకు "స్టే కి నో"
చంద్రనీతులు పట్టుకొని ఒక పత్రిక చక్కభజన - నిజమేంటి?
అభివృద్ధికి ఆయనే అడ్డంకి - హస్తినలో వాగ్ధానకర్ణుడుపై పేలుతున్నసెటైర్లు
నిర్ణయం పవన్ కళ్యాన్ దే! పొత్తుకు చంద్రబాబు రడీ!
రాజాసింగ్ ఒక్కడు చాలు! కేసీఆరును ఉప్పెనలా చుట్టేయటానికి?
మోడీకి పతనం మొదలైంది 'కోల్‌కతా యునైటెడ్ ఇండియా బ్రిగేడ్' లో చంద్రబాబు
చంద్రబాబుపై తలసాని చండ్ర నిప్పులు? బాబుపై సమర శంఖమేనా?
మహాకూటమి - మోడీకి ప్రత్యామ్నాయాన్ని ఇవ్వగలదా?
“15 నిమిషాలు ఇస్తే 100 కోట్ల హిందువులను చంపేస్తాం!” అన్న వారిని పూచికపుల్లలా తీసేసిన రాజాసింగ్
హత విధీ! అపర చాణక్యుడికిదేం గతి? ఆయన చివరి రోజులే ఈయనకు సంప్రాప్తమౌతున్నాయా?
యుద్దం జరగక పోయినా సరిహద్దుల్లో మన సైనికులు ప్రాణాలు ఎందుకు కోల్పోతున్నారు?
తగ్గిపోతున్న పురుషత్వం - సంతానోత్పత్తి తగ్గటానికి పురుషులే ప్రధాన కారణం
సామాన్యుని సణుగుడు: దొరవారూ! ఇది కరక్టేనా! మీకిది తగునా?
About the author