నీతీ నిజాయతీ ఆత్మసాక్షి ఋజువర్తన వీటి ముందు ప్రపంచమే పాదాక్రాంతమౌతుంది. వాటిని అనుసరించించినాడు బాజపా కీర్తి ప్రతిష్ఠలను దేదీప్యమానం చేసు కుంది బిజెపి. ఇటువంటి సన్నివేశమే దాదాపు 22 ఏళ్ల కిందట పార్లమెంట్‌లో చోటు చేసుకుంది. అప్పట్లో వాజ్‌పేయీ ప్రభుత్వానికి మెజార్టీలేదు. కానీ, సభలో అత్యధిక సీట్లు మాత్రం భాజపాకే వచ్చాయి. దీంతో 13రోజుల్లోనే ప్రధాని పీఠం నుంచి ఆయన వైదొలగారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం సంచలనం సృష్టించింది.
yadyurappa emotional speech కోసం చిత్ర ఫలితం
అత్యధిక సీట్లు వచ్చినా పార్టీ ప్రతిపక్షంలో కూర్చోగా, ఒక్క సీటు వచ్చిన పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైపోయిందని ఆయన నిలదీశారు. తాము బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని హుందాగా పదవి నుంచి తప్పుకొన్నారు. ఈ ప్రసంగంతో అటల్‌ బిహారీ వాజ్‌పేయీకి అద్భుతమైన రాజకీయ మైలేజీ లభించింది. రాజకీయాల్లో పెద్దమనిషి ఇమేజి ఆయనకు దక్కింది. 


ఆ తర్వాత రెండేళ్లకే 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపా కూటమికి సంపూర్ణ మెజార్టీ లభించి దేశ ప్రధానిగా వాజ్‌పేయీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరణతో 1999లో మరోమారు లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. అప్పుడు కూడా వాజ్‌పేయీ నేతృత్వంలోని ఎన్‌డీఏకు మెజార్టీ లభించింది. దీంతో 2004 వరకు ప్రధానిగా వాజ్‌పేయీ కొనసాగారు.
world appreciated vajpeyee కోసం చిత్ర ఫలితం
అలా నైతికత ప్రదర్శించని తీరుతో కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష ముందే యడ్యూరప్ప రాజీనామా చేయడం ప్రజాస్వామ్యం సాధించిన విజయమని ప్రజాస్వామ్య ప్రియులు అభివర్ణించారు. నాడు విస్తృత ఋజువర్తనతో మాహానేత వాజపేయీ సాధించిన విజయం నేడు కుక్కమూతి పిందెల మనస్తత్వమున్న ఈ తరం రాజకీయ నాయకుల కోవలోకి వచ్చిన యెడ్డీతో  కర్ణాటకలో బిజెపి చరిత్ర తిరగబడింది. అక్కడి తాజా పరిణామాలతో దేశం మొత్తం ఆనందం హర్షాతిరేఖాలు వ్యక్తం చేస్తోంది. కర్ణాటక శాసనసభలో క్లైమాక్స్‌ ఈ విధంగా మలుపు తీసుకుంటుందనేది ఏవరూ ఊహించి ఉండరు. 


ముఖ్యమంత్రిగా యడ్యూరప్పను నియమించడాన్ని కాంగ్రెస్-జేడీ(ఎస్‌)లు సవాలుచేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన తరవాత చోటు చేసుకున్న సంఘటనలు, జరిగిన పరిణామాలు క్రైం-థ్రిల్లర్ సినిమాను మించి నరాలు తెగే ఉత్కంఠను రేపాయి. విజయం తమదేనన్న ధీమాకు సంఖ్యాబలం దన్ను లభించకపోవడంతో యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి జస్ట్ 55గంటల్లోనే ముగిసిపోయింది. 
సంబంధిత చిత్రం
విధానసభలో భావోద్వేగభరిత ప్రసంగం చేసిన యడ్యూరప్ప విశ్వాస పరీక్ష ఎదుర్కొనకుండానే, జాతీయ గీతాలాపన జరుగుతూ ఉండగానే, ఆగకుండానే, కంటతడితో వెనుదిరిగారు. నేరుగా రాజ్‌భవన్‌ వెళ్లి రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
 
తమ ఎమ్మెల్యేలు ప్రలోభాల పర్వంలో చిక్కుకోకుండా 'కనురెప్పలు మూయని కళ్ల' తో కాపాడుకోగలిగిన "కాంగ్రెస్-జేడీ(ఎస్‌)" లు అంతిమంగా విజయానందాన్ని చవి చూశాయి.  కాంగ్రెస్-జెడిఎస్ కూటమి తరఫున జేడీఎస్‌ నేత కుమార స్వామి ముఖ్యమంత్రి గా రానున్న 23న బెంగళూరు విధానసౌధలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎన్నిక ల్లో మూడో స్థానంలో నిలిచినా ముచ్చటైన వ్యూహంతో 85ఏళ్ల తన తండ్రి మాజీ ప్రధాని హెచ్ డి దేవెగౌడ కలను సాకారం చేయనున్నారు. 
world appreciated vajpeyee కోసం చిత్ర ఫలితం
మొత్తానికి కాంగ్రెస్‌ చూపించిన ప్రణాలికా బద్ద చొరయ సమయస్పూర్తి దైవం సుప్రీంకోర్టు రూపంలో చూపిన మార్గదర్శనం కలిసొచ్చినకాలం కాంగ్రెస్‌-జేడీఎస్‌ ల సడలని ఐక్యత, ఎమ్మెల్యేలు పార్టీ పట్ల ప్రదర్శించిన విధేయత, మోదీ-షా నాయకత్వానికి బలమైన స్ట్రోక్ ఇచ్చిన చేదు అనుభవం ఇవన్నీ కలసి కుమారస్వామిని విజయపథం వైపు నడిపించాయి. 
vajpayee yeddyurappa కోసం చిత్ర ఫలితం
ప్రమాణ స్వీకార వేడుకకు హాజరు కావాల్సిందిగా సోనియా, రాహుల్‌, కేసీఆర్‌, చంద్రబాబు, మాయావతి, మమత, అఖిలేశ్‌ వంటి నాయకులను కుమారస్వామి ఆహ్వా నించడం, తద్వారా విపక్షాల సమైక్యత చాటి చెప్పేందుకు ఒక విజయవేదికను సమకూర్చడం, దేశ భవిష్యత్‌ రాజకీయాలకు నిర్దేశనం లభించగలదన్న నమ్మకం కలుగుతుంది. చూద్ధాం! 
yadyurappa emotional speech కోసం చిత్ర ఫలితం
నేను తలచిన దానికి వ్యతిరెఖ దిశలో దైవం తలిచారు!

ఆత్మసాక్షి ప్రకారం కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు నాకు మద్దతునిస్తారని ఆశించాను. నేను విపక్ష సభ్యులతో మాట్లాడిన సంగతి నిజమే. బలపరీక్షలో సహకరిస్తామన్న వారు చివరి క్షణంలో జారుకున్నారు. రాష్ట్ర ప్రజలు మరోక్షణం ఆలోచించి ఓటేసి ఉంటే పూర్తి మెజారిటీతో రాష్ట్రాభివృద్ధి చేసేవాడిని. కానీ.. దైవేచ్ఛ అనుకూలంగా లేదు.

-యడ్యూరప్ప మూణ్ణాళ్ళ ముఖ్యమంత్రిత్వంలో ప్రసంగంలోని చివరి మాటలు. 
 congress in emergency days కోసం చిత్ర ఫలితం
ఇప్పుడు నీతులువల్లించే కాంగ్రెస్ నాయకుల, నాటి నీచచరిత్రకు, ప్రజాస్వామ్యానికి ఘోరీకట్టిన, నాయకత్వచరిత్రను కూడా గుర్తుంచుకొని మెలగాల్సిన అవసరం కర్నాటక పౌరులకుంది. ఎవరి చరిత్రైనా మరవద్దు. చరిత్రను ఉపేక్షిస్తే మనకు వర్తమానం ఆపై భవిషత్తు ఉండని యువత గ్రహించాలి. భారత రాజకీయ పక్షాలన్నీ ప్రజాస్వామ్య నిరోధక వ్యవస్థలే. ఇది చరిత్ర చెపుతున్న ఇతిహాసం. దేవె గౌడ కూడా దీనికి అతీతం కాదు. కుమారస్వామి ఇదే ధరం సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ను నిర్ధాక్షిణ్యంగా కూల్చేశాడు. తస్మాత్ జాగ్రత్త. 

మరింత సమాచారం తెలుసుకోండి: