తాము అధికారం లో ఉంటె ఏం చేసిన చెల్లుతుంది అనే అహంకారం లో ఇప్పటివరకు మోడీ ప్రభుత్వం ఉంది. రాజ్యాంగానికి విలువలు ఇవ్వకుండా ప్రజస్వామ్యాన్ని కాలరాస్తూ ఎమ్మెల్యేల ను ఫిరాయింపులను ప్రోత్స హిస్తూ ఎంతో దిగిజారిపోయి ప్రవర్తించింది. ఏకంగా సీఎం కాండిడేట్ అయినటువంటి యడ్యూరప్ప ఫోన్ టేప్ లో దొరికిపోయాడు. ఇటువంటి ఆకృత్యాలు చేసి అధికారం లో కి రావాలని బీజేపీ ప్రయ్నత్నించింది. చివరికి సుప్రీం కోర్ట్ కలగచేసుకొని బల నిరూపణను ఒక రోజుకు తగ్గించడం తో బీజేపీ కి మైండ్ బ్లాక్ అయ్యింది. 

Image result for modi amit shah

అయితే ప్రమాణ స్వీకారం రోజు యడ్యూరప్ప కాషాయరంగు కాకుండా ఆకుపచ్చ రంగు శాలువ కప్పుకున్నప్పుడే ఎక్కడో తేడా వచ్చిందనే విషయం తెలుస్తూనే ఉంది. అయినా రాష్ట్ర బీజేపీ నేతల్లో ఎక్కడో చిన్న ఆశ మినుక్కు మినుక్కుమంటూనే ఉంది. వాస్తవానికి ఐబీ వంటి సెంట్రల్‌ ఏజన్సీల సాయం లేకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ గట్టెక్కరు. ఈ సారి కేంద్రం ఎమ్మెల్యేల విషయంలో ఐబీని ఎక్కువగా వాడినట్లు లేదు. ఇక బీజేపీ వెనకడుగు వేసింది కాబట్టి కాంగ్రెస్‌ ముందడుగు వేసినట్లే!

Image result for modi amit shah

ఈ మొత్తం ఘనతంతా రాహుల్‌ గాంధీకే కట్టపెడతారనటంలో ఎటువంటి సందేహంలేదు. కర్ణాటక రాజకీయ వ్యూహంలో కాంగ్రెస్‌ కురువృద్ధుల వ్యూహరచన ఎక్కువగా కనిపిస్తోంది తప్ప రాహుల్‌ పాత్ర నేరుగా ఉన్నట్లులేదు. అయినా రాహుల్‌దే విజయమని అందరూ సంబరాలు చేసుకోవటం కాంగ్రెస్‌ పార్టీలో రివాజే! రాహుల్‌ అనేకాదు.. పార్టీ అధ్యక్షుడిగా ఎవరున్నా అదే సంప్రదాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: