ఏ పనైనా చెయ్యాలంటే ప్రణాళిక దానికి తగిన విధి విధానమూ నిర్ణయం చేసి, ఎవరైనా పనిని ముందుకు తీసుకెళతారు. ఆఖరి పోరాటం, శక్తి లేని ఆక్రందన, ఏదో ప్రకటన చేసి, ఆ తరవాత అది అపహాస్యం అవ్వటం, తను ప్రాణ ప్రథంగా భావించే పరువు ప్రతిష్ట గంగ పాలవ్వటం ఇది అమరావతిలో రోజూ జరిగే తంతే.


ప్రతిపక్షం లేని శాసనసభలో ఏవో ప్రభోదాలు ఉపన్యాసాలు. పోరాడే శత్రువే లేని సమరాంగణాన శూన్యం లో కరవాలం త్రిప్పినట్లుంది చంద్రబాబు రాజకీయం. నాలుగేళ్ళు కలసి మెలసి కేంద్రంతో చేసిన సంసారం, కేంద్రం రాష్ట్రంతో నెఱపిన స్నేహం, చెప్పిన మాటలు, చేసిన బాసలు-ఏ వీ ఆనాటి సుగంధాలు విరజిమ్మిన మైతీసుమాలు.

chandrababu ecxpecting public people protection కోసం చిత్ర ఫలితం

 ప్రజల నుండి రక్షణ కోరుతూ బాధ్యతల నుండి తప్పించుకోజూసే ప్రభుత్వాధినేత 


ఇదంతా చూస్తుంటే "అనుభందం ఆత్మీయత అంతా ఒక బూటకం" అన్నట్లే ఉంది చంద్రబాబు రాజకీయ జీవన శైలి.  అసలు మోడీ నుండి ఆ స్నేహం లేనేలేదు. అదంతా బాబు గారి ఒంటిచేతి చప్పట్లే. నారా చంద్రబాబు నాయుడు అధినేతగా ఉన్న తెలుగు దేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉందా? లేక ప్రతిపక్షంలో ఉందా?  చంద్రబాబు గారి టిడిపి కంపెనీ తీరును చూస్తుంటే - ఇవి ఇప్పుడు ఏపి ప్రజలకు కలిగే అనుమానాలు. మనసులను తొలిచే ప్రశ్నలు. రాజకీయ పరిణామాల విషయంలో, జరుగుతున్న సంఘటనలపై తెలుగుదేశం పార్టీ స్పందిస్తున్న తీరును చూస్తుంటే రాష్ట్రంలో అధికారంలో ఉండీ ఇలా ప్రవర్తిస్తుంటే ఈ అనుమానాలు కూడా బలపడుతున్నాయి.

assembly of AP without opposition కోసం చిత్ర ఫలితం

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంలేని శాసనసభతో ప్రభుత్వం నడిపే నాయకత్వానికి ఉన్న సార్వం సహా సార్వబౌమాఅధికారం చేతిలో ఉంచుకొన్నదున జరుగుతున్న ఈ పరిణామాలపై తెలుగు దేశం బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే చంద్రబాబు మాత్రం ఇలాంటి బాధ్యతలు తీసుకోవడం లేదు.  అంతే కాకుండా ప్రజల నుండి రక్షణ కోరుతూ బాధ్యతల నుండి తప్పించుకోజూడటం ప్రజల అలొచనలను సంక్షొభంలోకి నెట్టేస్తుంది. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్, బిజెపి సమక్షంలో  రాష్ట్రానికి వాగ్ధానం చేసిన ప్రత్యేక ప్రతిపత్తి హోదా సాధన విషయం లో అధికార పక్ష కుప్పిగంతులు ప్రజావళి చూస్తూనే ఉంది. ప్రతిపక్షాన్ని పరిహాసంచేస్తూ అధి కారపక్షం కేంద్రానికి నాలుగేళ్ళు దాస్యం చేసి ప్రజలకు చేసిన ద్రోహం విషయంలో తెలుగు దేశం పార్టీ తీరును ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు.

assembly of AP without opposition కోసం చిత్ర ఫలితం

ప్రత్యేక హోదా ఇవ్వాలని 2014ఎన్నికల ముందు చంద్రబాబు డిమాండ్ చేశాడు. తమకు అధికారం ఇస్తే ప్రత్యేక హోదా వస్తుంది అని చెప్పాడు. తీరా! అధికారం సాధించుకున్న తర్వాత మాత్రం చంద్రబాబు నాయుడి తీరుమారిపోయింది. కేంద్ర ప్రభుత్వంలో అధికార భాగస్వామిగా ఉంటూ కూడా ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు మాట తప్పాడు.

assembly of AP without opposition కోసం చిత్ర ఫలితం

ప్రత్యేక హోదాతో ఏమీ రాదని చెప్పాడు. ప్రత్యేక హోదా కన్నా గొప్పదైన ప్రత్యేక ప్యాకేజీ వస్తుందని కేంద్రంలోని బిజెపి ఇస్తుందని అన్నాడు. ప్రత్యేక హోదా కోరే వాళ్లు తెలివి తక్కువ దద్దమ్మలు అని, వారిని జైలుకు పంపుతాను అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించాడు. ఆ తరవాత చెలరేగిన గొడవల్లో అనెక మంది విద్యార్ధులు చిత్ర పరిశ్రమ వ్యక్తులు దెబ్బలు తన్నులు తన్నించుకున్నారు టిడిపి ప్రభుత్వంలోని పోలీస్ అధికారులతో. 

jagan meetings కోసం చిత్ర ఫలితం

ఈ రకంగా మాటలు మార్చి ఆ సందర్భానికి తగిన విధంగా ప్రవర్తించి కలం గడిపేశారు. ఆ తర్వాత బీజేపీతో తనకు తన పార్టీకి మైత్రి చెడిన తర్వాత మాత్రం మాత్రమే చంద్ర బాబు ప్రత్యేక హోదా కావాలని అంటున్నాడు. అప్పటికే ప్రత్యేక హోఆ కోరుతూ వైసిపి ప్రజలను మేలుకొలుపుతూ ప్రత్యేక హోదా వేడి చల్లారకుండా జనావళిని నడిపిస్తూ ఉన్న ఉద్యమ స్థాయి లో ఉన్న వాతావరణాన్ని హైజాక్ చేయటానికి ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన ఆ తర్వాత తన రాజకీయ మనుగడ కోసం మాత్రమే, ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు వాదిస్తున్నాడు.

assembly of AP without opposition కోసం చిత్ర ఫలితం

ప్రతిపక్షంలేని శాసనసభ శత్రువులేని సమరాంగణం 


ఇలాంటి ద్వంద్వ వైఖరులను అనుసరిస్తూ చంద్రబాబు నాయుడు హోదా కోసం దీక్షలు, ధర్నాలు, నిరసనలు తదితర కార్యక్రమాలు ప్రభుత్వంలో ఉండీ, ప్రభుత్వం పై యుద్ధం చేసే ఒక కౄరమైన ప్రణాళిక తను తప్పించుకొని కేంద్ర ప్రబుత్వంపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు తనదైన ప్రత్యేక శకుని తరహా రాజకీయాలను చేపడుతున్నాడు.

jagan meetings కోసం చిత్ర ఫలితం

ప్రతిపక్షనాయకునికి ప్రజల్లో దినదినప్రవర్ధమానంగా పెరుగుతున్న ప్రతిష్ఠ 


మొన్నా మధ్య నరెంద్ర మోడీ ఏదో ఒకరోజు ప్రతిపక్ష విడ్డూరమైన విధానాలను నిరసిస్తూ చేసిన దీక్షను విమర్శించాడు చంద్రబాబు. అధికారంలో ఉండి ఎవరైనా దీక్షలు చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించాడు. అలాంటి పెద్దమనిషే తరవాత చేస్తే తనే ధర్మ దీక్ష చేశాడు. అదే వేదికపై తన బావమరిది హిందూపురం శాసన సభ్యుని చేత నరెంద్ర మోడీని తిట్టిన తిట్టుతిట్టకుండా తిట్టేయించాడు.

four year of chandrababu cheating the ap state కోసం చిత్ర ఫలితం

అలాగే దాచేపల్లి పసిపాపపై జరిగిన అత్యాచార ఘటన విషయంలో కూడా చంద్రబాబుతీరు విడ్డూరంగా ఉంది. అత్యాచార ఘటనలకు బాధ్యత వహించాల్సిన చంద్రబాబు వాటికి నిరసనగా ర్యాలీ చేయించాడు తన వాళ్ల చేత. గతంలో ఢిల్లీలో అత్యాచారాలు అధికం అయినప్పుడు మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన చంద్రబాబు తను రాజీనామా చేయకుండా తను బాధ్యత వహించ కుండా ర్యాలీలు చేయిస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడా? ప్రతిపక్షంలో ఉన్నాడా? అనే అనుమానం ప్రతి భారతీయునికి కలుగుతుంది.

four year of chandrababu cheating the ap state కోసం చిత్ర ఫలితం
దేశంలో ఏ మంచి జరిగినా నేపధ్యంలో నేనే ఉన్నాననటం (కర్ణాటక విజయం కాంగ్రెస్-జెడిఎస్ ది- టిడిపిది కాదు) - ఏ తప్పు జరిగినా వాటికి మోడీ-షాలే కారణం అనటం బాబు తీరైంది. ప్రశ్నించే శాసనసభలేదు. అందులో ప్రతిపక్షమూ లేదు. అసలు శాసనసభే ఎన్నికల ప్రచార వేదికగా మారటం ప్రపంచంలో ఎక్కడైనా చూశామా? అన్నిటికీ ప్రతిపక్షం అడ్డుపడుతుందని చెపుతూ దీక్షలు, నిరసనలు చేసే ప్రభుత్వాధినేతను చూశామా? ఇంత బాధ్యత మరచిన ఈ నేతను సమర్ధిస్తూ రోజు ప్రస్తుతించే తెలుగు మీడియాలో ప్రజాస్వామ్య లక్షణం ఇసుమంత అయినా ఉందా? 


నేడు భారతీయ జనతా పార్టీ కర్ణాటక శాసనసభలో గుణపాఠం నేర్చుకుంది. రానున్నకాలంలో దాని గత మిత్రుడు తెలుగుదేశం పార్టీకీ ఆ గతిపట్టక తప్పదు. విధి లిఖించిన భాగ్యరెఖల రాతల నుండి ఎవరూ తప్పించుకోలేరు. 

four year of chandrababu cheating the ap state కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: