కుమార్ స్వామి కి ఉన్న సుడి మరెవరికి లేదని చెప్పవచ్చు. పట్టుమని నలభై సీట్లు కూడా సాధించలేని ఒక పార్టీ అధినేత ఏకంగా కర్ణాటక సీఎం అయి పోవడం నిజముగా అదృష్టం అని చెప్పవచ్చు. బీజేపీ తరువాత అతి పెద్ద పార్టీ గా కాంగ్రెస్ అవతిరించింది. అయితే ఎక్కడ బీజేపీ జేడీఎస్ ను తన వైపు లాక్కుంటుందోనని భయపడి, జేడీఎస్ కు కాంగ్రెస్ ఏకంగా సీఎం పదవిని ఆఫర్ చేసింది. దీనితో జేడీఎస్ కాస్త కింగ్ మేకర్ నుంచి ఏకంగా కింగ్ అయిపోయాడు. 

Image result for kumar swamy

సంకీర్ణాల్లో సాధారణంగా పెద్ద పార్టీ ముఖ్యమంత్రి పీఠాన్ని చేపడుతుంది. చిన్న పార్టీ మంత్రి పదవులతో సర్దుకుంటుంది. అయితే కర్ణాటకలో ఎక్కడ బీజేపీ ఛాన్స్ దక్కించుకుంటుందో అనే భయంతో కాంగ్రెస్ పార్టీ కుమారస్వామి మెడ మీద కత్తి పెట్టినట్టుగా సీఎం సీట్లో కూర్చోబెడుతోంది. ఇలా కోరి వచ్చిన పదవిలో కొన్నాళ్లు కూర్చున్నా ఫర్వాలేదన్నట్టుగా కుమారస్వామి కూర్చుంటున్నాడు. బుధవారం ఈయన ముఖ్యమంత్రి అవుతాడు. అయితే ఆ తర్వాత బలపరీక్ష ఉంటుంది.

Image result for kumar swamy

కాబట్టి బలపరీక్ష కూడా అంత ఈజీ వ్యవహారం కాదు. కుమారస్వామి ప్రమాణ స్వీకారం సమయానికి మంత్రి పదవుల విషయంలో కూడా కొంత క్లారిటీ వస్తుంది. అప్పుడు కొందరు నిరాశవహులుగా మారవచ్చు. ఎవరో జేడీఎస్ కు చెందిన వ్యక్తిని సీఎం చేస్తుండటం పట్ల కాంగ్రెస్‌లోనే ఎంతో కొంత అసహనం మొదలవ్వవచ్చు. కాబట్టి కుమారస్వామి ముచ్చట కూడా కొన్ని గంటలేనా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: