ప్రస్తుతం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ ఏపిలో పర్యటన కొనసాగిస్తున్నారు.  ఈ సందర్భంగా ఆయనకు ఎక్కడికి వెళ్లినా జనాలు నీరాజనాలు పలుకుతున్నారు.  అంతే కాదు వెళ్లిన ప్రతి చోటా పవన్ కళ్యాన్..సీఎం...సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు.  తాజాగా ఇచ్ఛాపురం బహిరంగసభలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలో ‘సీఎం..సీఎం‘ అనే నినాదాలు మిన్నంటాయి. దీంతో, ఈ విషయమై పవన్ మాట్లాడుతూ, ‘చెప్పాను కదా! మీరు సీఎం..సీఎం అని అరిస్తే నేను అవను.

ఓట్లు వేస్తే సీఎం అవుతా. ఓటర్ కార్డు తీసుకుని మీరు ఓట్లు వేస్తే నేను సీఎంను అవుతా. మీ అమ్మానాన్నగార్ల చేత మీరు ఓట్లు వేయిస్తే నేను సీఎం అవుతా అన్నారు.  మీకు దోపిడీ చేసే ప్రభుత్వం.. అవినీతితో నిండిపోయిన ప్రభుత్వాలు కావాలంటే ఆ పార్టీల వద్దకు వెళ్లమని చెప్పండి. నిజాయతీగా ఏమీ ఆశించకుండా ఉండే ముఖ్యమంత్రి, ప్రభుత్వం కావాలంటే మాత్రం ‘జనసేన’, పవన్ కల్యాణ్ ని ఎంచుకోమని చెప్పిండి.

ఓట్లను డబ్బుతో కొనే వ్యవస్థకు చరమాంకం పలకాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకని, మీ అందరి ఆశీస్సులతో సరికొత్త రాజకీయ వ్యవస్థను 2019లో జనసేన పార్టీ కచ్చితంగా స్థాపిస్తుంది.ఆ దేవుడి దయవల్ల..గంగమ్మతల్లి దయవల్ల శ్రీకాకుళం ప్రజల కష్టాలు తీర్చేందుకు జనసేన పార్టీకి ఒక అవకాశం ఇప్పించమని కోరుకుంటున్నా’ అని అన్నారు.

Related image

గత ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం ప్రతీ జనసేన కార్యకర్త చెమటోడ్చినట్టు చెప్పారు. తమ కార్యకర్తలు అండగా నిలబడడం వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. జనసేన అండతో గెలిచిన ఎమ్మెల్యేలు నేడు తమకు వ్యతిరేకంగా మాట్లాడడం బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తామేమీ రాజకీయాలు తెలియని చిన్నపిల్లలం కామని, తమకూ గడ్డాలు నెరిశాయని, కాకపోతే రంగు వేసుకుంటున్నామంటూ ఆవేశంతో ఊగిపోయారు. పవన్ ఆ మాట అనగానే అభిమానులు, కార్యకర్తలు కేరింతలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: