క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంత్రి భూమా అఖిల ప్రియ‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు అంత ఈజీ కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎమ్మెల్యేగా ఎన్నికై నాలుగేళ్లు గ‌డిచిపోవ‌డం, అటు త‌ర్వాత మంత్రిగా అధికారం చేప‌ట్టి ఏడాది పూర్త‌వ‌డం, అయినా ఎక్క‌డి స‌మ‌స్య‌లు అక్క‌డే ఉండ‌డం వంటివి ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తి నెల‌కొనేలా చేశాయి. దీనికితోడు చీటికీ మాటికీ.. ఏవీ సుబ్బారెడ్డితో ర‌గ‌డ‌కు సిద్ధ‌మ‌వ‌డం కూడా భూమా రాజ‌కీయ వార‌సురాలిపై మ‌ర‌క‌లు వేస్తున్నాయి. ప్ర‌ధానంగా ఆమె త‌న వ‌ర్గానికి త‌ప్ప ప్ర‌జల‌కు అందుబాటులో ఉండ‌డం లేద‌నేది ప్ర‌ధాన ఫిర్యాదు. 

Image result for bhuma akhila priya

గ‌త ఎన్నిక‌ల్లో అఖిల ప్రియ త‌ల్లి భామా శోభ ఇక్క‌డ పోటీకి దిగారు. అయితే, ఎన్నిక‌లు రెండు రోజులు ఉండ‌గానే ఆమె రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందారు. ఈ నేప‌థ్యంలో అప్ప‌టి వైసీపీ అభ్య‌ర్థిగా భూమా అఖిల ప్రియ రంగంలోకి దిగింది. అయితే, భూమా నాగిరెడ్డి హ‌వా, శోభా నాగిరెడ్డి మృతి సెంటిమెంటు వంటివి బాగా క‌లిసొచ్చి అఖిల‌ను విజ‌య‌తీరానికి చేర్చాయి. అయితే, ఆ త‌ర్వాత అధికార పార్టీలోకి జంప్ చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి రెండేళ్లూ.. విప‌క్షంలో ఉండ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో అభి వృద్ధి కి పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌లేక‌పోయారు. 

Image result for av subba reddy

అయితే, ఆ త‌ర్వాత అధికార పార్టీలోకి అడుగు పెట్టినా.. నియోజ‌క‌వ‌ర్గం లో అభి వృద్ధిపై శీత‌క‌న్నేయ‌డం వివాదంగా మారింది.  నిజానికి ఆళ్ల‌గ‌డ్డ‌లో ఎక్కువ కాలం భూమా కుటుంబం నుంచి వ‌చ్చిన నాయ‌కులే ఎన్నిక‌వుతూ వ‌చ్చారు. అయిన‌ప్ప‌టికీ.. ఇక్క‌డ అభివృద్ధి జ‌ర‌గ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ప్ర‌ధానంగా ఇక్క‌డ ర‌హ‌దారుల‌న్నీ రాళ్లు తేలి క‌నిపిస్తున్నాయి. న‌గ‌రంలోని మొలక‌ల వాగు అభివృద్ది కూడా ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా సాగుతోంది. కీల‌క‌మైన రుద్ర‌వ‌రం మండ‌లంలో 35 గ్రామాల‌కు తాగునీటిని అందించే హ‌రిన‌గ‌ర్ ర‌క్షిత మంచినీటి ప‌థ‌కానికి రూ.40 కోట్ల‌తో 2009లో ప‌నులు ప్రారంభించారు. 

Image result for chandrababu naidu

అయితే, 6 కోట్ల మేర‌కు ప‌నులు పూర్తి చేసిన త‌ర్వాతదీనిని ప‌ట్టించుకున్న నాథుడు క‌నిపించ‌లేదు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో శోభా నాగిరెడ్డి.. ఈ ప‌నులు పూర్తి చేయిస్తాన‌ని హామీ ఇచ్చారు. అయితే, అఖిల ప్రియ ఈ ప‌నుల‌పై క‌నీసం దృష్టి కూడా పెట్ట‌డం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ కోసం ఇప్ప‌టి నుం చే చ‌క్రం తిప్పుతుండ‌డం, ఏవీ సుబ్బారెడ్డిని నిలువ‌రించ‌డం పైనే ఆమె దృష్టి పెడుతున్నార‌ని, మంత్రిగా కూడా త‌మ‌కు ఎలాంటి సాయం చేయ‌డం లేద‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు వాపోతున్నారు. మొత్తంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేసినా.,.అఖిల గెలుపు అంత ఈజీ కాద‌నేది విశ్లేష‌కుల అంచ‌నా! 


మరింత సమాచారం తెలుసుకోండి: