రాధిక కుమారస్వామి ఈమె గురించి నిన్న మొన్నటి వరకు పెద్దగా ఎవ్వరు పట్టించుకోలేదు. అయితే హఠాత్ గా నిన్న ఆల్ ఇండియా లెవల్ లో ఈమె నిన్న గూగుల్ ట్రెండ్స్ లో అగ్రస్థానంలో నిలవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీనికి కారణం ఈమె కర్ణాటక రాష్ట్రానికి కాబోతున్న ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య కావడంతో ఈమెకు ఈ గుర్తింపు లభించింది. 
రాధికను పెళ్లాడిన ఏడాదిలోనే సీఎంగా
వాస్తవానికి వీరిరువురికీ ఇది రెండవ పెళ్లి. వీరికి షర్మిలా కుమారస్వామి అనే కూతురు ఉంది. అనూహ్యంగా వీరి పెళ్ళిని 2010 లో దక్షిణ భారత హీరోయిన్ కాంగ్రెస్ నాయకురాలు రమ్యకు కుమారస్వామికి మధ్య ఆనాడు జరిగిన వాగ్యుయుద్ధంలో రాధిక కుమారస్వామి పేరు బయట పడింది. తొమ్మిదో తరగతి చదువుకుంటూ ఉన్నప్పుడు కన్నడ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన 31 ఏళ్ల రాధిక 30కి పైగా సినిమాలలో నటించారు. 
సెర్చింగ్ సమయంలో రాధిక
పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. 2005లో రాధికాకుమారస్వామిలకు పరిచయమైంది. 2006లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. 2006లో ఈమెను పెళ్లి చేసుకున్న తరువాత కుమారస్వామి మొట్టమొదటిసారిగా కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు పనిచేసారు. తెలుగులో కూడ సినిమాలు చేసిన ఈమె నందమూరి తారక రత్నతో గతంలో నటించింది. కుమారస్వామి పెద్ద భార్య కొడుకు నిఖిల్ గౌడ హీరోగా నటించిన ‘జాగ్వార్’ సినిమాను కన్నడ తెలుగు భాషల్లో అత్యంత భారీ స్థాయిలో నిర్మించి విడుదల చేసిన ఆమూవీ పెద్దగా విజయవంతం కాలేదు. 

ఇప్పుడు తండ్రి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి నిఖిల్ గౌడతో సినిమాలు చేయడానికి టాప్ డైరెక్టర్స్ ముందుకు వస్తారేమో చూడాలి. ప్రస్తుతం రాధిక కుమారస్వామి  ఫ్యామిలీ ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్‌ గా మారిన నేపధ్యంలో ఈమె ఫోటోలు జాతీయ మీడియాకు కూడ హాట్ న్యూస్ గా మారింది. బుధవారం ప్రమాణస్వీకారం చేయబోతున్న కుమారస్వామి ప్రభుత్వం ఎన్ని నెలలు కొనసాగుతుంది అని చర్చలు జరుగుతున్న నేపధ్యంలో వచ్చే ఏడాది జరగబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవసరాల రీత్యా కుమారస్వామి ప్రభుత్వానికి డోకా లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: