ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి వస్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్ భారీ అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు మంటల్లో చిక్కుకొని దగ్ధమయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలో మవారం ఉదయం 11.15 గంటల సమయంలో ప్యాంట్రీ కారుకు ముందున్న బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా ఇవి బి-5, బి-6, బి-7 బోగీలకు కూడా వ్యాపించాయి.  ఈ సంఘటన చూసి ప్రయాణీకులు ఒక్కసారే భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు.  కాగా, షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
fire on 4 coaches of ap express in gwalior
ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.  సిగ్నల్ కోసం నిలిచి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు రైలు నుంచి దిగారు. వీరిలో 36 మంది శిక్షణలో ఉన్న ఐఏఎస్‌లు కూడా ఉన్నారు.

గ్వాలియర్‌ సమీపంలోని బిర్లా నగర్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. సిగ్నల్‌ ఇచ్చి ఉంటే రైలు అక్కడి నుంచి కదిలేదని.. అదే జరిగితే పెను ప్రమాదం జరిగేదని ప్రయాణికులు చెబుతున్నారు. రైలు ఆగి ఉండటంతోనే ప్రాణాలతో బయటపడ్డామని తెలిపారు. ఏపీ ఎక్స్‌ప్రెస్ ప్రమాద విషయం తెలియడంతో ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 

ఏపీ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం.. హెల్ప్ లైన్ నంబర్లు గ్వాలియర్ 

0751-2432799 0751-2432849, 

ఝాన్సీ 0510- 2440787 0510- 2440790 


fire on 4 coaches of ap express in gwalior
ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. 4 బోగీలు దగ్ధం
ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి వస్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్ భారీ అగ్ని ప్రమాదానికి గురైంది. మంటల్లో నాలుగు బోగీలు దగ్ధమయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం 11.15 గంటల సమయంలో ప్యాంట్రీ కారుకు ముందున్న బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా ఇవి బి-5, బి-6, బి-7 బోగీలకు కూడా వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

సిగ్నల్ కోసం ఆగడంతో తప్పిన ప్రమాదం.. 
మంటలు చెలరేగిన సమయంలో రైలు సిగ్నల్ కోసం నిలిచిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు రైలు నుంచి దిగారు. వీరిలో 36 మంది శిక్షణలో ఉన్న ఐఏఎస్‌లు కూడా ఉన్నారు. గ్వాలియర్‌ సమీపంలోని బిర్లా నగర్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. 

ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. సిగ్నల్‌ ఇచ్చి ఉంటే రైలు అక్కడి నుంచి కదిలేదని.. అదే జరిగితే పెను ప్రమాదం జరిగేదని ప్రయాణికులు చెబుతున్నారు. రైలు ఆగి ఉండటంతోనే ప్రాణాలతో బయటపడ్డామని తెలిపారు. 
AP Express

ఏపీ ఎక్స్‌ప్రెస్ ప్రమాద విషయం తెలియడంతో ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: