కోవ‌ర్టు!  ఈ ప‌దం వింటేనే రాజ‌కీయ నేత‌లు ఒణికిపోతుంటారు. తాము నానా క‌ష్టాలు ప‌డి ఎదుటి పార్టీని బ‌ద్నాం చేసేం దుకు చేసే ప్ర‌య‌త్నాలు, వేసే వ్యూహాలు.. అన్నింటినీ ప్ర‌త్య‌ర్థి పార్టీకి చేర‌వేసే వారంటే చాలు దిమ్మ‌తిరిగిపోతోంది. అందునా ఏడాదిలోనే ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ప్ర‌తి పార్టీ కూడా త‌మ ప్ర‌త్య‌ర్థుల‌పై వ్య‌తిరేకంగా స్కెచ్‌లు సిద్ధం చేసుకుంటోంది. అయితే, కోవ‌ర్టుల మూలాన ఆ  స్కెచ్‌లు ముందే లీకైపోయి.. ఇబ్బంది గా మారిపోయింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అధికార పార్టీ టీడీపీని క‌ల‌వ‌ర‌ప‌రిచిన ఈ కోవర్టుల గోల‌.. ఇప్పుడు జ‌న‌సేన ను సైతం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. 

Image result for tdp

జ‌న‌సేనలో కోవ‌ర్టులు ఉన్నార‌ని, వారి వ‌ల్ల పార్టీ ఇబ్బందులు ప‌డుతోంద‌నే కామెంట్లు విన‌వ‌స్తున్నాయి. ఇక‌, ఈ కోవ‌ర్టు ఏ రూపంలోనైనా ఉండొచ్చు!  దీంతో నాయ‌కులు అల్లాడి పోతున్నారు. జ‌న‌సేన విష‌యానికి వ‌స్తే.. పవన్ కల్యాణ్‌కు ఇటీవల ఓ సినీ నిర్మాత దగ్గరయ్యారు. ఆయన తీసిన ఓ సినిమా ఈ వారంలో విడుదల కాబోతోంది. ఆ సినిమా వేడుకకు పవన్ కూడా హాజరయ్యారు. హీరోతో ఉన్న దోస్తీ కారణంగా పవన్ హాజరయ్యారే మో అనుకున్నారు కానీ.. అసలు విషయం మాత్రం నిర్మాతతో సాన్నిహిత్యమట. ప్రస్తుతం ఆ నిర్మాత జనసేన ..సోషల్ మీడియా టీంకు నిధులు ఇస్తున్నార‌ని స‌మాచారం. 

Image result for pawan  kalyan

దీంతో ఆయ‌న డామినేటింగ్‌గా వ్యవహరిస్తున్నారని జనసేన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన నిజంగా జనసేనపై అభిమానంతో రాలేదని.. కోవర్ట్ అంటూ ఫ్యాన్స్  చర్చించు కుంటున్నారు. దానికి ఆయన చేస్తున్న వ్యవహారాలను సాక్ష్యంగా వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నారు. శతఘ్ని టీం వ్యవహారాల్లో ఈ నిర్మాత ఇప్పుడు ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటున్నారట. తనకు నచ్చని వ్యక్తులపై ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తూ… జనసేన ఇమేజ్‌కు దెబ్బతీస్తున్నారనేది.. ఫ్యాన్స్ ఆరోపణ. జనసేనకు శత్రువులను పెంచుతూ పోతున్నారని.. ఈ సమయంలో.. ఇలా వ్యతిరేకుల్ని పెంచుకోవ‌డం సమంజసం కాదని.. జనసేన ఫ్యాన్స్  చర్చించుకుంటున్నారు. 


పార్టీ అధినేతను సదరు నిర్మాత మభ్యపెడుతున్నారని ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి ఈ నిర్మాత ఇప్పుడు జనసేనలో హాట్ టాపిక్ అయ్యారు. ఇది పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లిందో లేదో కానీ… ఫ్యాన్స్ మాత్రం… సదరు నిర్మాతను…జనసేన నుంచి దూరం చేయాలన్న పట్టుదలతో ఉన్నార‌ని టాక్‌. ఏదేమైనా మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు ఉండ‌డం, జ‌న‌సేనానికి ఈ ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా మార‌డం, ఇప్పుడు కోవ‌ర్టు క‌థ తెర‌మీదికి రావ‌డం వంటి ప‌రిణామాలు.. ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: