నిన్నటివారం జరిగిన కర్ణాటక ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నిన్న అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సిన యడ్యూరప్ప తగిన బలం లేకపోవడంతో కనీసం విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టకుండానే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి గవర్నరుకు తన రాజీనామాను సమర్పించాడు.

అయితే ఈ తతంగం అంతా జరిగి బీజేపీ కి అన్ని దారులు ముసుకపోయేలా చేసి వారి ఆనందాన్ని  రెండు రోజులకు మాత్రమే పరిమితం చేసింది ఒకే ఒక్కడు. ఆయనే కాంగ్రెస్ నేత డీకే శివకుమార్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎత్తులకు పై ఎత్తులు వేసి వారి వ్యూహాలన్నీ దెబ్బతీశాడు. ఆయనకు కర్ణాటక రాష్ట్రంలో మంచి పేరు, ధన, జన బలగం ఉంది. దీని వల్లనే యడ్యూరప్ప, గాలి జనార్దన్ రెడ్డి వంటి వారు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల్ని కొనడానికి ప్రలోభపెట్టినప్పటికి అవి పని చేయలేకపోయాయి.

అంతేగాక బీజేపీకి మద్దతిచ్చేలా చివరి వరకు సస్పెన్సు కు తెరలేపిన ఇద్దరు కాంగ్రెస్  ఎమ్మెల్యేల యవ్వారాల్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి కాంగ్రెస్ తోనే ఉండేలా కీలక పాత్ర వహించాడు. దానికి మించి ఎమ్మెల్యేలు  అందరు అమ్ముడుపోకుండా వారందరిని హైద్రాబాదుకు చేర్చి తిరిగి  విధానసభకు హాజరయేంత వరకు వారిని కాచిపెట్టుకొని రక్షణ కల్పించడంలో కీలక పాత్ర వహించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: