త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా విషయం లో చాలా వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ చెప్పిన కథలో ఎన్టీఆర్  చాలా మార్పులు చేసాడని గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇంత కు ముందు త్రివిక్రమ్ ఏది చెబితే అది జరిగేది కానీ ఇప్పడూ త్రివిక్రమ్ హవా రివర్స్ అయ్యిందని చెప్పవచ్చు. ఎన్టీఆర్, సినిమా లో చాలా  మార్పులు సూచించాడని క్లాస్ గా తీసే త్రివిక్రమ్ మూవీ ని కొంచెం మాస్ గా మారుస్తున్నడని సినీ సర్కిల్ వినిపిస్తున్న మాటలు. 

Image result for jr ntr and trivikram

న్టీఆర్ తో సినిమాకు త్రివిక్రమ్ తన స్టయిల్ కథ చెప్పారని, దాన్ని అలా అలా ఎన్టీఆర్ కలుగ చేసుకుని, కొరటాల శివ టైపు స్టయిల్ కు మార్పించారని తెలుస్తోంది. త్రివిక్రమ్ చెప్పిన ప్రతిసారీ ఎన్టీఆర్ మార్పులు చేర్పులు చేస్తూ వచ్చారని, దీనిపైనే చాలా కాలం నిత్యం డిస్కషన్లు నడిచాయని తెలుస్తోంది. అలాగే టైటిల్ విషయంలో కూడా చాలా జరిగినట్లు తెలుస్తోంది.కేవలం అరవింద సమేత అన్నదే త్రివిక్రమ్ సజెస్టెడ్ టైటిల్ అని తెలుస్తోంది.

Image result for jr ntr and trivikram

అయితే వీర రాఘవ అన్న మాస్ టచ్ ఇచ్చేలా చేసింది ఎన్టీఆర్ అనే టాక్. క్లాస్ ఫస్ట్ లుక్ ఇద్దామంటే, దాన్ని మాస్ లుక్ కు మార్చింది కూడా ఎన్టీఆర్ నే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే మళ్లీ మోషన్ పోస్టర్ పేరిట క్లాస్ లుక్ ను, పుట్టిన రోజు శుభాకాంక్షల పేరిట మరో యూత్ లుక్ ను విడుదల చేసారని వినికిడి. నిజానికి త్రివిక్రమ్ అనుకున్నది యూత్ ఫుల్ లవ్ స్టోరీనే తీయాలని, కానీ తెరవెనుక ఎన్టీఆర్ ఎవరి సలహాలు తీసుకుంటున్నారో కానీ, త్రివిక్రమ్ చెప్పిన స్టోరీకి మార్పులు చేర్పులు చెబుతూ దాన్ని కొరటాల శివ టైపు స్టోరీలోకి మార్చారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: