పవన్ కళ్యాణ్ ఉన్నట్టయిండి ఒక్క సారిగా సీఎం జపం చేస్తున్నాడు. మొన్నటివరకు నాకు అంత సీన్ లేదు నాకు సీఎం అయ్యే మెజారిటీ రాదు అని పవన్ కళ్యాణ్ చాలా సార్లు చెప్పినాడు. ఇంకా చెప్పాలంటే నాకసలు అధికారమే అవసరం లేదు. పదవులు నాకు తుచ్చమైనవి అని సినిమా డైలాగ్స్ చెప్పినాడు. ఇప్పుడేమో 2019 లో నన్ను సీఎం ను చేయండి. మీ బ్రతుకులు మారుస్తా అని అందరి రాజకీయ నాయకుల మాదిరిగా హామీలు ఇస్తున్నాడు. 

Image result for pavan kalyan and janasena

ఎక్కడికక్కడ ప్రభుత్వాలు ఏమీ చేయడం లేదనే మాట రువ్వేయడమే తప్ప.. ఒకవేళ తానైతే ఏం చేస్తానో కూడా చెప్పకుండానే పవన్ యాత్ర సాగిస్తున్నాడు. ఏ ప్రాంతంలో అడుగు పెడుతోంటే.. ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని సమస్యల గురించి పుక్కిట పట్టి అక్కడకు చేరుకోగానే అప్పజెప్పేయడం లక్ష్యం అన్నట్లుగా సాగుతున్నదే తప్ప... నిర్దిష్ట ప్రణాళిక కనిపించడం లేదు. సోంపేట బాధితుల ప్రాంతానికి వెళ్లినప్పుడు.. పవన్ కల్యాణ్ జనాంతికంగా పర్యావరణానికి హాని చేసే ఏ అభివృద్ధినీ తాను సమర్థించను అంటూ ఓ భారీ డైలాగు వేశారు.

Image result for pavan kalyan and janasena

ఈ లెక్కన పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయితే పోలవరం ప్రాజెక్టును కూడా ఎక్కడికక్కడ ఆపేయాలి. అసలు పర్యావరణానికి హాని కలిగించని ప్రాజెక్టులు ఏం ఉంటాయి. కాకపోతే పర్యావరణానికి సంబంధించినంత వరకు అది కలిగించే సామాజిక ప్రయోజనం ఎంత? దానివలన పర్యావరణ నష్టం ఎంత అనేది అధ్యయనం చేసి, అనుమతులు ఇవ్వడానికి దేశవ్యాప్తంగా ఓ ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుంది. వారి అనుమతులు రాకుండా ఏ చిన్న పని కూడా నడవడం అసాధ్యం. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఇటువంటి చౌక బారి మాటలు ఆపి తాను ఏం చేస్తానో స్పష్టముగా చెబితే ఉపయోగం ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: