మరో రెండు నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితే ఎన్నికలు నిర్వహించాలి. కానీ టీడీపీ సర్కార్ మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు వస్తుండడం తో బాబు ఈ ఎన్నికలను వాయిదా  మేలని యెల్లో మీడియా లో కథనాలు వచ్చినాయి. దీనితో చంద్ర బాబు నాయుడు ఎన్నికలు చూసి భయ పడుతున్నాడని అందరికి ఈజీ గా అర్ధం అవుతుంది. 

Image result for chandra babu

కేవలం పంచాయతీ ఎన్నికలను మాత్రమే కాదు, మున్సిపోల్స్‌ను కూడా ఇప్పుడప్పుడే నిర్వహించడానికి చంద్రబాబు సర్కారు సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాయనుందట. ఇప్పుడప్పుడే ఎన్నికలు వద్దని, వాటి నిర్వహణకు తమకు కొంత సమయం కావాలని ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాయనున్నదని తెలుగుదేశం అనుకూల పత్రికే మొదటి పేజీ వార్తలో పేర్కొంది.

Image result for chandra babu

దీనికిగానూ ఆ పత్రిక చెప్పిన కారణం ఒకటే.. ‘సాధారణ ఎన్నికలను మరో ఏడాదిలో నిర్వహించనున్నందున పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసుకోవడమే మేలన్న యోచనలో ప్రభుత్వం ఉంది..’ అంటూ పేర్కొంది ఆ పత్రిక. వేరే ఎవరో ఇలారాస్తే అదో లెక్క కానీ తెలుగుదేశం ప్రధాన భజంత్రీనే ఇలా రాయడంతో ఫలితాలు తేడాకొడితే మొత్తానికి మునుగుతాం అనే భయంతో చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తోందని స్పష్టం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: