నీరు-ప్రగతి, వ్యవసాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమీక్షలో కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఎండలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందన్న ఆయన ఉష్ణోగ్రతలు తగ్గించాలని అధికారులను ఆదేశించారు. మరీ ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంతంలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గించాలని ఆదేశాలు జారీ చేశారు.  దాంతో అధికారులకు దిమ్మతిరిగే షాక్ కి గురయ్యారు. 
Image result for andhrapradesh
ఎండలను తామెలా తగ్గించాలంటూ సీఎం వ్యాఖ్యలపై అధికారులు విస్మయం చెందారు. తర్వాత ఆయన చెప్పిన విషయాన్ని అర్ధం చేసుకొని అప్పుడు కూల్ అయ్యారు.  అసలు విషయానికి వస్తే..సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..చెరువులు, కాల్వలు, జలాశయాల్లో నీటినిల్వలు పెంచాలన్నారు. పచ్చదనం, తుంపర సేద్యం ద్వారా ఉష్ణోగ్రతల్లో తగ్గుదల ఏర్పడుతుందని బాబు సూచించారు. 30 శాతం వర్షపాతం లోటు ఉన్నా 34 మీటర్ల భూగర్భజలాలు పెంచామని సీఎం అన్నారు. నీరుప్రగతి, జల సంరక్షణ ఉద్యమాలే భూగర్భ జలాల పెంపునకు కారణమన్నారు.
Image result for sun heat
భూసారంలో సూక్ష్మ పోషకాల సమతుల్యత ఉండాలన్నారు. బిందుసేద్యం, తుంపర సేద్యం మరింత పెరగాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఊరూరా పశుగ్రాస క్షేత్రాలపై దృష్టి పెట్టాలని, ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు.
Image result for cm chandrababu collectors meeting
ఓడీఎఫ్‌ ప్లస్‌లో కూడా మన రాష్ట్రమే ముందంజలో ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.క ర్నూలు, కడపలో ఉపాధి కూలీల సంఖ్య మరింత పెరగాలని, ఇళ్ల నిర్మాణం మరింత వేగవంతం కావాలన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: