ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని సినీప్రముఖులపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి ఇటీవల జరిగిన సంఘటనల దృష్ట్యా గత కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ ఫేస్ బుక్ ద్వారా ఎదో ఒక సంచలనాన్ని సృష్టిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె మానవ హక్కుల ప్రతినిధి బాబు గోగినేనిపై ఫేసుబుక్లో వివాదాస్పద పోస్టు చేసింది. 


గతంలో శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ వివాదం ఒక ఊపుమీద ఉన్న సమయంలో శ్రీ రెడ్డి, బాబు గోగినేని ఇద్దరూ కలిసి న్యూస్ స్టుడియోలలో జరిగే ఇంటర్వ్యూలకు కలిసి పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన శ్రీరెడ్డి మానసిక పరిస్థితి బాగలేకపోవడంతోనే ఆమె అలా ప్రవర్తిస్తుంది అనడం, దీనితో ఆమె ఆయనపై ఘాటు వాఖ్యలు చేయడం జరిగాయి. అయితే తాజాగా ఆయన జనసేనలో చేరబోతున్నట్లు వస్తున్న ఊహాగానాలపై ఆమె తన అభిప్రాయాన్ని ఫేసుబుక్ వేదికగా జనసేన అధినేతకు తెలిపింది. 


బాబు గోనినేని జనసేన పార్టీలో చేరబోతున్నట్లు, ఈ క్రమంలోనే వారితో ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తనకు తెలిసినట్లుగా చెప్పుకొచ్చింది. అతను తన ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసాడని, తనను పరుష పదజాలంతో దూషించిన విషయాన్ని తెలిపింది. అతని బండారం అంతా తనదగ్గర ఉందని, అతను మంచివాడు కాదని అందువల్లే పవన్ కల్యాణ్ అతనిని జనసేన పార్టీలో చేర్చుకోవద్దని ఈ మేరకు ఆమె పవన్ కు విన్నవించుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: