ఈ సారి మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడాన్ని, సీఎం పదవిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదలకూడదని ప్రతిపక్షనేత జగన్ చాలా పక్కాగా ఉన్నాడు. ఈ క్రమంలోనే జనాలకు దగ్గరగా ఉంటూ ఓటు బ్యాంకు సాధించడానికి ప్రజాసంకల్పయాత్ర పేరుతో పాదయాత్రను కొనసాగిస్తూ గత వారమే రెండువేల కిలోమీటర్ల పాదయాత్ర మైలురాయిని సాధించాడు.


కాగా అప్పట్లో బీజేపీ ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదని తేల్చినపుడు తన ఎంపీలతో రాజీనామా చేయిస్తానని చెప్పి, చేయించి ప్రత్యర్థులకు ఆలోచించలేని షాక్ ఇచ్చి జనాల్లో మంచిపేరు కొట్టేసాడు. అయితే అప్పుడు స్పీకర్ వారి రాజీనామాలను ఆమోదించలేదు. కాగా ఇప్పుడు జగన్ మళ్ళీ రాజీనామాల వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. నిజానికి వారి రాజీనామాలకు గల కారణాలను తెలుపమని పలుమార్లు స్పీకరు వారిని పిలిచినా వారు కొన్ని కారణాల వల్ల కలవలేకపోయారు.


అయితే వారు మళ్ళీ తమ రాజీనామాలను ఆమోదించండి అని కోరడంతో స్పీకర్ సుమిత్ర మహాజన్ వారి రాజీనామాల విషయమై ఈ నెల 29న ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వవలసిందిగా కోరడం జరిగింది. ఈ మేరకు వారికి విడివిడిగా లేఖలు పంపడం జరిగింది. కాగా ఈ పిలుపుపై స్పందించిన ఎంపీలు రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్న ఈ నిర్ణయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు. ఏదిఏమయినా రాజీనామాల అస్త్రాన్ని జగన్ మళ్ళీ పైకి తీసుకరావడం ఏదో ఎత్తుగడ వేయడానికే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: