మన దేశం లో కలియుగ దైవం గా కొలిచే వెంకటేశ్వర స్వామీ దేవాలయం తిరుమల ఆంధ్ర ప్రదేశ్ లో కొలివి తీరింది. అయితే కొన్ని రోజుల నుంచి తిరుమల దేవాలయం మీద రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలు జాతీయ మీడియా ను కూడా ఆక్షర్షించాయి. దీనితో టీడీపీ ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. రమణ దీక్షితులు వ్యవహారం నేషనల్ మీడియాకు ఎక్కింది. గులాబీ వజ్రం, కృష్ణదేవరాయలు సమర్పించిన నగల వ్యవహారంపై జాతీయ మీడియా దృష్టి పెట్టింది.

Image result for tirumala

దీంతో చంద్రబాబు అండ్ కోకు గాభరా పుడుతోంది. అసలు టీటీడీ చానెల్ లో రాఘవేంధ్రరావు, కీరవాణిలు తప్ప వేరెవరూ లేకుండా చేసారని విమర్శలు వున్నాయి. అందుకు గాను లక్షలు లక్షలు బిల్లులు చెల్లిస్తున్నారని విమర్శలు వున్నాయి. నిజమెంతో తెలియదు కానీ, ఇప్పుడు ఆ చానెల్ పై పెత్తనం మొత్తం రాఘవేంద్రరావుకు కట్టబెట్టారు. తెలుగు మీడియా వీలయినంత టోన్ డౌన్ చేయాలని చూస్తోంది. మరోపక్క రమణ దీక్షితులుపై బురద జల్లాలని చూస్తోంది. కానీ ఫలితం కనిపించడం లేదు. రమణ దీక్షితులు లేవనెత్తిన సందేహాలు సమాధానాలు మాత్రం ఇవ్వడం లేదు.

Image result for tirumala

నిధులు దుర్వినియోగం కావడం లేదు, ప్రభుత్వ ఉద్యోగిగా వుంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా? విమర్శిస్తారా? అంటూ వేరే యాంగిల్ లో వస్తున్నారు. మరి మొన్నటికి మొన్న అశోక్ బాబు ప్రభుత్వ ఉద్యోగిగా వుంటూ బెంగళూరు రాజకీయ ప్రచారం కోసం ఎందుకు వెళ్లారో? ఎవరు పంపారో? ఏమైనా ఏ తిరుపతిని 2014లో తెలుగుదేశం పార్టీ వాడుకుందో? ఆ తిరుపతి-తిరుమలనే 2019లో బాబుకు ఎదురు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: