బిజెపి ప్రజా ప్రతినిధి సోము వీర్రాజు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నిర్వాకంపై అనేక ప్రశ్నలు సంధించారు. ప్రఖ్యాత హైందవ క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పాలన అధికారి అంటే ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాలా? లేక శ్రీనివాస రాజా? ఇప్పుడు టిటిడిలో ఎవరి పరిపాలన నడుస్తోంది? అని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. 

somu on chandrababu కోసం చిత్ర ఫలితం

ఐఎఎస్ అధికారి అయిన శ్రీనివాస రాజుకు బదిలీ ఉండదా? అని అడిగారు. శ్రీనివాస రాజు ఎవరి సహకారంతో తొమ్మిదేళ్లుగా అదే పీఠంపై పాతుకు పోయి ఉన్నారు? అంతకాలం  పదవిలో ఎలా కొనసాగుతున్నారు? అని ప్రశ్నించారు. సాధారణంగా ఐఏఎస్ అధికారులు మూదేళ్ళకు మించి ఒకే చోట పని చేసే సాంప్రదాయం లేదు కదా/ మరి ఈయన ఒక దశాబ్ధ కాలం టిటిడిలో పాతుకొని ఎందుకు ఉండి పోయారు? 

chandrababu jds కోసం చిత్ర ఫలితం

భక్తుల కోసం నిర్దేశించిన సేవలను ఎవరెవరికో అమ్ముకుంటూ ధర్మానికి సంబంధించిన సంపదను, ధనాన్ని ఏలా దుర్వినియోగం చేస్తున్నారు? అని ప్రశ్నిస్తూ ఆ సొమ్మంతా ఎవరి చేతుల్లోకి చేరుతోందో? అనేది ప్రజలకు తెలియాలని అన్నారు. హిందూ సంప్రదాయబద్ధంగా సనాతనంగా వస్తున్న ఆలయమర్యాదలు సాంప్రదాయాలు గాడితప్పడం, ప్రశ్నార్ధకన్ గా మారటం దానే ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు బహిరంగంగా ప్రశ్నించారని ఆయన గుర్తు చేశారు.
రమణ దీక్షితులు అమిత్ షాను కలవడాన్ని కూడా రాజకీయం చేస్తే ఎలా? అడిగారు. శ్రీ వెంకటేశ్వరస్వామి పై చంద్రబాబు చేస్తోన్న కుయుక్తులకు ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని ఆయన అన్నారు. 

chandrababu jds కోసం చిత్ర ఫలితం

ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని, పరిపాలనను గాలి కొదిలేసి కర్ణాటక రాజకీయాలతో, దేశ రాజకీయాలతో కాలం గడుపుతున్నారని ఆయన విమర్శించారు. చంద్ర బాబు ప్రభావం ఉంటే కర్ణాటకలో బీజేపీకి 20 శాతం నుంచి 35 శాతం ఓట్లు ఎలా పెరుగుతాయని ప్రశ్నించారు. 

chandrababu jds కోసం చిత్ర ఫలితం
140 సీట్లలో డిపాజిట్‌ కోల్పోయి కేవలం 38 సీట్లు గెలుచుకున్న జేడీఎస్‌  ప్రమాణస్వీకారానికి వెళ్లేందుకు చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నారని ఆయన అన్నారు.  పవన్‌, జగన్‌లను బీజేపీ నడిపిస్తే చంద్రబాబును నడిపించేదెవరు? అని కొంచెం ఘాటుగానే ప్రశ్నించారు. నలభై ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఎవరిని నడిపిస్తున్నారని ప్రశ్నించారు. 
chandrababu jds కోసం చిత్ర ఫలితం
అలాగే 600 పైగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు చేసిన వాగ్ధానాలు మరచి, ప్రత్యేక పాకేజి కేంద్రాన్ని కోరుకుని, తిరిగి మళ్ళా ఊ-టర్న్ తీసుకొని, ప్రత్యేక హోదా అడుగుతూ ధర్మ పోరాటం చేస్తూ అధర్మంగా ప్రవర్తిస్తూ, ప్రజల ముండు, ప్రతిపక్షం ముందూ పరువు కోల్పోయి బొక్క బోర్లా పడ్డ చంద్రబాబు నాయునికి 60-70శాతం ప్రజా వ్యతిరేఖత ఉన్న విషయంపై ప్రజలు నిర్విరామంగా చర్చిస్తున్నారు. ఇప్పటికైనా తాను మేల్కొని రాజకీయాలు పక్కన బెట్టి రాష్త్ర ప్రయోజనాలు పట్టించుకోపోతే జనం రానున్న ఎన్నికల్లో తరిమి కొట్టేలా ఉన్నారు. 

somu on chandrababu కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: