ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వ తీరుకి నిరసనగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు శ్రీకాకుళం జిల్లా పలాసలో నిరసన కవాతు నిర్వహించిన విషయం తెలిసిందే. స్థానిక హరిశంకర్ థియేటర్ నుంచి కాశిబుగ్గ బస్టాండ్ వరకు జరిగిన ఈ కవాతు అనంతరం బహిరంగ సభలో పవన్ కల్యాణ్‌ ప్రసంగిస్తున్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప‌వ‌న్ అక్క‌డ జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో బాబు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు.

2014 ఎన్నికల్లో తెదేపా, భాజపాకు తాను మద్దతు ఇచ్చానని.. వారు జనానికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం వల్లే ప్రజల తరఫున వారిపై పోరాటం చేసేందుకు వచ్చానన్నారు. ఎక్కడైతే దోపిడీ, దౌర్జన్యాలు ఉంటాయో.. అక్కడ కచ్చితంగా తిరుగుబాటు వస్తుందని ఉద్ఘాటించారు. శ్రీకాకుళం పోరాటాల నేల అని అన్నారు. . ఆ వేదిక వద్ద ఉన్న అభిమానులు పవన్ కు కొబ్బరిబోండం అందజేసి తాగాల్సిందిగా కోరారు.

దీంతో, ఆ కొబ్బరిబోండం అందుకున్న పవన్, ‘ఈ కొబ్బరిబోండం మన పలాసది. విదేశీ పానియాలు ఏం దాహం తీర్చుతాయి! ఇది కదా దాహం తీర్చేది. మన కొబ్బరినీళ్లు..మన పలాస బోండం తీరుస్తుంది దాహం..బండిలో పెట్టండి.. దారిలో తాగుతాను’ అంటూ ఆ బోండాన్ని తన సహచరులకు అందజేశారు. అయితే, ఈలోగా, మరొక కొబ్బరిబోండాన్ని పవన్ కు ఇవ్వడం ఆ కొబ్బరినీళ్లు తాగారు.



మరింత సమాచారం తెలుసుకోండి: