జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రజాపోరాట యాత్ర అంటూ రాష్ట్రంలో తెగ హడావిడి చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. అయితే అప్పటి జరిగిన ఎన్నికలలో...ఎక్కడ కూడా పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. ఆ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తే చంద్రబాబు కాలర్ పట్టుకొని ప్రశ్నిస్తాను అని ప్రగల్భాలు పలికారు..తిర తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక..చంద్రబాబు భయంకరమైన అవినీతికీ పాల్పడటం జరిగింది.
Image may contain: 5 people, crowd, sky and outdoor
అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అవినీతి చేసిన ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన దాఖలాల్లేవు. పైగా ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రశ్నిస్తున్న కి జగన్ పైన విమర్శలు చేసి తెలుగుదేశం పార్టీ మన్ననలను అందుకున్నాడు పవన్. అయితే ఎన్నికలకు ఇంకా సంవత్సరమున సమయంలో తెలుగుదేశం పార్టీపై అవనీతి ఆరోపణలు చేసి బయటకు వచ్చి ప్రస్తుతం ప్రజాపోరాట యాత్ర అంటూ రాష్ట్రంలో ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు. అయితే ఇంతవరకు ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్  యాత్రలో చేస్తున్న హావభావాలకు అభిమానులు అససహనం చెందుతున్నారు.
Image may contain: 5 people, people smiling, people standing and outdoor
పైగా పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వచ్చి రాజకీయ నాయకుడి లా కాకుండా ఇంకా సినిమా హీరోలనే ప్రవర్తిస్తున్నాడు అని అంటున్నారు సామాన్యజనులు. ఎవరైనా పవన్ కళ్యాణ్ కలుద్దామని వస్తున్న పవన్ కళ్యాణ్ భద్రతాసిబ్బంది వారితో వ్యవహరిస్తున్న తీరు అనేక వివాదాలకు దారితీస్తుంది. తాజాగా కలుద్దామని విద్యుత్తు సిబ్బంది కొందరు వచ్చి పవన్ బస వద్ద.. ఆయనను ఓసారి బయటకు రమ్మనగానే.. పవన్ బౌన్సర్లు.. కుదరదని చెప్పారు.
Image may contain: 9 people, people smiling, crowd and outdoor
పవన్ ఓసారి గదిలోకి వెళ్లిన తర్వాత.. మళ్లీ బయటకు రావడం అసాధ్యం అనే సంకేతం ఇచ్చారు. అయితే అక్కడ సమస్య కొంచెం తీవ్రతరమైనది కాబట్టి కలవాలని అడగగా వాగ్వాదం చోటుచేసుకుంది...పవన్ భద్రతాసిబ్బంది ఇంకా కొంచెం అతి చేస్తూ వచ్చిన వారిపై దాడి చేసే విధంగా వ్యవహరించారు. అక్కడికొచ్చిన విద్యుత్ సిబ్బంది... ఇతడు రాజకీయాలలో కంటే సినిమా రంగంలోనే ఉంటేనే మంచిదని విసుగు చెంది వెనుదిరిగి వెళ్లిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: