Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Sep 20, 2018 | Last Updated 1:59 am IST

Menu &Sections

Search

రూటు మార్చిన చంద్రబాబు..! ఇక దూకుడే..!!

రూటు మార్చిన చంద్రబాబు..! ఇక దూకుడే..!!
రూటు మార్చిన చంద్రబాబు..! ఇక దూకుడే..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

విశాఖ ధర్మపోరాట దీక్ష వేదికగా ఢిల్లీ పెద్దలపై సీఎం చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు. విభజన హామీలు అమలు చేయకపోతే.. గతంలో జాతీయ పార్టీలకు పట్టిన గతే పడుతుందని బీజేపీని హెచ్చరించారు. కర్ణాటక ఎన్నికల్లో తెలుగు వారి దెబ్బ కాషాయ పార్టీకి తెలుసొచ్చిందన్న సీఎం... కేంద్రం సహకారం లేకపోయినా రాష్ట్రాభివృద్ధి ఆగబోదని విశ్వాసం వ్యక్తంచేశారు...

chandrababu-dharma-porata-deeksha-ap-govt-vizag-vi

బీజేపీ టార్గెట్ గా విశాఖ ఏయూ గ్రౌండ్స్ లో నిర్వహించిన ధర్మపోరాట దీక్షకు సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు ప్రజాప్రతినిధులు తరలివచ్చారు. దీక్షలో బీజేపీ, జనసేన, వైసీపీ లక్ష్యంగా మంత్రులు, నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్.. బీజేపీ, జనసేన, వైసీపీ ని టార్గెట్ చేశారు. పది పంచాయతీలో గెలవలేని బిజెపితో రాష్ట్రం కోసమే పొత్తు పెట్టుకున్నామని, వార్డు సభ్యులు గా గెలవలేని నేతలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు ఇప్పించామన్నారు. ఎవరో చెప్పితే నా పైన ఒక పెద్దాయన అవినీతి ఆరోపణలు చేశారని.. వాటిని ఇప్పటికైనా నిరూపించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి అన్నారు...

chandrababu-dharma-porata-deeksha-ap-govt-vizag-vi

కార్యక్రమం చివర్లో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు ... ప్రధాని మోడీ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు. తిరుపతిలో మోడీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ధర్మపోరాటం చేస్తున్నామన్నారు. మోడీ ఇచ్చిన హామీల వీడియోను సభలో ప్రదర్శించారు. హోదా కోసం అలుపు ఎరుగని పోరాటం చేసిన ఘనత టీడీపీ ఎంపీలదని బాబు తెలిపారు. కేంద్రమంత్రి పదవులను టీడీపీ నేతలు తృణప్రాయంగా వదులుకున్నారని గుర్తుచేశారు. వైసీపీ లాలూచీ రాజకీయాలు చేస్తుందన్నారు. టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి దేశవ్యాప్తంగా స్పందన వచ్చిందని, మిగిలిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చి మాకు మాత్రం ఎందుకు ఇవ్వలేదని సీఎం ప్రశ్నించారు...

chandrababu-dharma-porata-deeksha-ap-govt-vizag-vi

పటేల్ విగ్రహానికి రెండున్నర వేల కోట్లు ఇచ్చి...రాజధానికి 1500 కోట్లు ఇచ్చారంటే పరిస్ధితి అర్ధమవుతోందని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా పోలవరం ప్రాజెక్టు ఆగదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నదుల అను సంధానానికి శ్రీ కారం చుట్టామని సీఎం గుర్తుచేశారు. రాజధాని నిర్మాణానికి సహకారం లేదని, తనను నమ్మి రైతులు వేల ఎకరాలు ఇచ్చారని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలని కోరినా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పిన బాబు.. కేంద్రం అడ్డుపడితే అంతు చూస్తామని హెచ్చరించారు. వారికి సహకరించే పార్టీలను భూ స్థాపితం చేస్తామన్నారు. జాతీయ విద్యా సంస్థల ఏర్పాటు ఏటూ కాకుండా ఉందని చెప్పిన సీఎం.. దేశంలో తాము భాగం కాదా అని ప్రశ్నించారు. అనేక పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, వెనకబడిన జిల్లాలకు ఇస్తామన్న ప్యాకేజీ లు కూడా పూర్తి గా ఇవ్వలేదన్నారు. నిధులు అకౌంట్ లో వేసి మళ్ళీ వెనక్కి  తీసుకున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.. టీటీడీ వ్యవహారంలో రమణదీక్షితులు, ఐవైఆర్ కృష్ణారావు వంటి వారిని అడ్డుపెట్టుకుని తనపై కక్షసాధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి ఆరోపించారు.  గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి చంద్రబాబు నేరుగా పేర్లు పెట్టి మరీ విమర్శించడం పలువురిని ఆశ్చర్యపరిచింది. పైగా ఖబడ్దార్ అంటూ పేర్లు పెట్టి మరీ హెచ్చరించడం చూస్తుంటే బాబు స్టైల్ మార్చినట్టు అర్థమవుతోంది.

chandrababu-dharma-porata-deeksha-ap-govt-vizag-vi


chandrababu-dharma-porata-deeksha-ap-govt-vizag-vi
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.