ప్ర‌శ్నిస్తానంటూ పాలిటిక్స్‌లోకి వ‌చ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. రాజ‌కీయంగా నాలుగేళ్లు నిశ్శ‌బ్దంగా ఉన్నా.. ఇప్పుడు రెచ్చిపోతున్న విష‌యం తెలిసిందే. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అధికార టీడీపీకి మిత్రుడుగా ఉన్న ప‌వ‌న్‌.. ఇప్పుడు  ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేత‌కు శ‌త్రువుగా మారిపోయారు. ఇక‌, ఇప్పుడు.. అంద‌రి దృష్టీ.. వ‌చ్చే ఎన్నిక‌ల‌పైనే ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌రో ఏడాదిలోనే ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన‌లు ఎవ‌రికి తోచిన విధంగా వారు ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకు నే ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. ఈ క్ర‌మంలోనే నేత‌లు.. ప‌లు హామీల‌ను సైతం ఇస్తున్నారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల ప‌రిస్థితికి, ఇప్ప‌టికీ.. కూడా మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీలోనే లేదు. పైగా టీడీపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. 

Image result for tdp

ఇక‌, ఇప్పుడు ప‌రిస్థితి  యూట‌ర్న్ తీసుకుంది. జ‌న‌సేనాని తానే సొంత‌గా రంగంలోకి దిగుతాన‌ని అంటున్నారు. మొత్తం రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ త‌న పార్టీ పోటీ చేస్తుంద‌ని అంటున్నారు. అయితే, ఈయ‌న‌కు కార్య‌క‌ర్త‌లు ఉన్నారా?  నేత‌లు ఉన్నారా? అనే విష‌యాల‌ను కొద్ది సేపు ప‌క్క‌న పెడితే.. మొత్తం నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసే స‌త్తా ఉన్నా.. గెలిచే స‌త్తా ఎన్ని సీట్ల‌లో ఉంది?  ఎన్ని స్థానాల్లో బ‌ల‌మైన పోటీ ఇచ్చే సామ‌ర్థ్యం ఉంది? అనే ప్ర‌శ్న‌లు తాజాగా ఉద‌యిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో తూర్పు, ప‌శ్చిమ‌, గుంటూరు, కృష్ణా జిల్లాలో టీడీపీ హ‌వా సాగింది. ఇప్పుడు ప‌రిస్థితి ఎలాంటి ద‌శ‌లో ఉంది?  టీడీపీ హ‌వాను త‌గ్గించ‌కుండా ప‌వ‌న్ ముందుకు సాగ‌డం అయ్యే ప‌నేనా? అనే కీల‌క ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తున్నాయి. 

Image result for ysrcp

ప్రస్తుతం ఏపీలో అధికారం చేపట్టే అవకాశాలు రెండు పార్టీలకే ఉండేది.  అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల‌కు మాత్రం బల‌మైన కేడ‌ర్‌, బ‌ల‌మైన నాయకులు ఉన్నారు. ఇప్పుడు పవన్ ఎంట్రీ ఇవ్వడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతోం ది. పవన్ సామాజికవర్గ ఓటు కూడా ఆయనకే పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం 175 సీట్ల లెక్కలో ప‌వ‌న్‌కు ఎన్ని వ‌స్తాయి? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఆయన సామాజికవర్గం ఉంది. జనాభా పరంగా వారు ఏపీలో  దాదాపు 22శాతానికి పైగా ఉన్నారు.
Related image
ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీ నుంచి చీలితే దాన్ని పవన్ చేజిక్కించుకోవచ్చు. ఈ లెక్కన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 30 నుంచి 40 సీట్లు దక్కించుకునే అవకాశాలున్నాయంటున్నారు. ఇంత‌కు మించి సీట్లు సాధించాలంటే.. కీల‌క‌మైన నాయ‌కులు ఆ పార్టీకి అవ‌స‌రం. అయితే, ఇప్ప‌టికీ పార్టీలో కీల‌క నాయ‌కులు లేక‌పోవ‌డం.. జ‌న‌సేన‌కు మైన‌స్‌గా మారిపోయింది. మ‌రి ప‌వ‌న్ చెబుతున్న‌ట్టు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసి ప్ర‌యోజనం ఏంటో ఆయ‌న‌కే తెలియాలి! 


మరింత సమాచారం తెలుసుకోండి: