క‌ర్నాట‌క 24వ ముఖ్య‌మంత్రిగా జెడిఎస్ అధినేత కుమార‌స్వామి బుధ‌వారం ప్ర‌మాణస్వీకారం చేశారు. విధాన సౌధ‌లో గ‌వ‌ర్న‌ర్ వాజూభాయ్ వాలా స్వామి చేత ప్ర‌మాణం చేయించారు స‌రిగ్గా 4.35 నిముషాల‌కు నూత‌న ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ స్వీకారానికి బిజెపి వ్య‌తిరేకుల్లో అత్య‌ధికులు హాజ‌రయ్యారు.  రెండోసారి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన కుమార‌స్వామి 25వ తేదీన అసెంబ్లీలో బ‌ల‌నిరూప‌ణ చేసుకోవాల‌ని గ‌వ‌ర్న‌ర్ ఆదేశించారు. ప్ర‌మాణ‌స్వీకారానికి బిజెపియేత‌ర పార్టీల‌కు చెందిన ప‌లువురు అతిర‌ధ‌మ‌హార‌ధులు హాజ‌ర‌య్యారు.మొత్తం మీద ప్ర‌మాణ‌స్వీక‌ర కార్య‌క్ర‌మం ఓ పండుగ వాతావ‌ర‌ణంలో జ‌రిగ‌టం విశేషం. అలాగే, డిప్యుటి సిఎంగా కాంగ్రెస్ నేత ప‌ర‌మేశ్వ‌ర్ కూడా ప్ర‌మాణ స్వీకారం చేశారు. బ‌ల‌నిరూప‌ణ త‌ర్వాత పూర్తిస్ధాయి మంత్రివ‌ర్గాన్ని విస్త‌రిస్తారు.


కాంగ్రెస్ నుండి సోనియా గాంధి, అధ్య‌క్షుడు రాహూల్ గాంధితో పాటు ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెనర్జీ, తెలంగాణా ముఖ్య‌మంత్రి కెసిఆర్, ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్, మ‌హారాష్ట్ర నుండి ఎన్సీపి అధినే శ‌ర‌ద్ ప‌వార్ హాజ‌ర‌య్యారు. 


సిపిఎం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుండి మాజీ ముఖ్య‌మంత్రి మాయావ‌తి తో పాటు ప‌లువురు ఎంపిలు, రాష్ట్రాల మంత్రులు కూడా హాజ‌ర‌య్యారు. కుమార‌స్వామి రెండోసారి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకున్నారు. 25వ తేదీన కుమార‌స్వామి అసెంబ్లీలో బ‌ల‌నిరూప‌ణ చేసుకోవాలని గ‌వ‌ర్న‌ర్ ఆదేశించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: