రాజ‌కీయాల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు తిప్పిన‌న్ని చ‌క్రాలు అన్నీ ఇన్నీ కావ‌ని అంటారు అనుభ‌వ‌జ్ఞులు. రాజ‌కీయంగా తాను సేఫ్ అయ్యేందుకుఎలాంటి నిర్ణ‌యాలైనా, ఎలాంటి చ‌ర్య‌లైనా తీసుకునేందుకు చంద్ర‌బాబును  మించిన నాయకు డు మ‌రొకరు లేరని అంటారు. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీతో జ‌ట్టుక‌ట్టారు. అప్ప‌ట్లో గెలుస్తానో లేదో అని భావించిన ఆయ‌న వెంట‌నే సినీ ప్ర‌ముఖుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను కూడా త‌న‌వెంట తిప్పుకొన్నారు. ఆయ‌న బ‌లంతో ఈయ‌న గెలుపొం దారు. ఇక‌, ఆ త‌ర్వాత కేంద్రంతో త‌న‌కు సాగిన‌న్నాళ్లూ బాబు బీజేపీపై ఈగైనా వాల‌కుండా చూసుకున్నారు. అయితే, త‌ర్వాత బాబు ప్ర‌యోజ‌నాల‌కు దెబ్బ‌త‌గులుతున్న‌ట్టు గ్ర‌హించ‌డంతో వెంట‌నే ఆయ‌న బీజేపీకి రాం రాం చెప్పారు. ఇప్ప‌డు ఏకంగా బీజేపీని భూస్థాపితం చేస్తానంటూ.. ఆయ‌న ఊరేగుతున్నారు. 

Mamata Banerjee, Chandrababu Naidu pitch for all regional parties to come together

ధ‌ర్మ‌పోరాట దీక్ష పేరుతో ఆయ‌న బీజేపీ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే తిరుప‌తి, విశాఖల్లో భారీ ఎత్తున స‌భ‌లు కూడా నిర్వ‌హించి బీజేపీని ఏకేశారు. నిజానికి ఏపీలో బీజేపీ ప్ర‌భావం ఏమంత లేదు. అయినా కూడా ఒక జాతీయ పార్టీపైనా, అందునా పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేని పార్టీపైన బాబు ఇంత‌గా రెచ్చిపోవ‌డం ఏంటి? అనే సందేహం కామ‌న్‌. అయితే, బీజేపీని అడ్డు పెట్టుకుని ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను బ‌య‌ట ప‌డేందుకు రెడీ అవుతున్నా రనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది. అభివృద్ధి అన్న మాటే వినిపించ‌డం లేదు. మ‌రో ఏడాదిలోనే ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లో త‌న ప్ర‌భుత్వంపై వ్య‌తిరేకత లేకుండా చేసుకునేందుకు చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఫ్రంట్ గురించి ప్రశ్నించగా

ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్రాంతీయ పార్టీల కూట‌మితో బీజేపీని నిలువ‌రిస్తాన‌ని చెబుతున్నారు. తాజాగా చంద్ర‌బాబు క‌ర్ణాట కలో జేడీఎస్ సార‌ధి కుమార‌స్వామి.. సీఎంగా ప్ర‌మాణం చేస్తున్న కార్య‌క్ర‌మానికి ఆయ‌న హాజ‌రువుతున్నారు. ఈ నేప‌థ్యం లో బెంగళూరు వెళ్లిన  చంద్రబాబు నాయుడు జాతి ప్రయోజనాల దృష్ట్యా భవిష్యత్‌లో జేడీఎస్‌తో కలిసి పనిచేసే అవకాశం ఉందని  వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని ఆయన పిలుపు నిచ్చారు. సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అక్కడే ఉండటం విశేషం. అంతేకాదు, అంతకుముందు మమతా బెనర్జీతో చంద్రబాబు భేటీ అయినట్లు కూడా తెలిసింది. 


దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులు చర్చకొచ్చినట్లు సమాచారం. ఏపీకి జరిగిన అన్యాయాన్ని మమతకు చంద్రబాబు వివరించారు. బీఎస్పీ నేత మాయావతితో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. మొత్తంగా ఈప‌రిణామాల‌ను చూస్తుంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు గెలుపున‌కు మాత్ర‌మే దోహ‌ద ప‌డేలా క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: