పుట్టా సుధాకర యాదవ్ వేరే మత సానుభూతి పరుడు. ఆయన క్రిష్టియన్ అనటానికి గతములో అనేక మంది సాక్ష్యాధారాలు ఆయన ఆ మతాభివృద్ధికి చేసిన సేవలు, ఇచ్చిన ధనసహాయం చిన్న విషయాలేమీ కాదు. భారత ప్రజాస్వామ్యం వ్యక్తి స్వాతంత్రానికి విలువ నిస్తుంది కాబట్టే ఆయన ఇష్టం వచ్చిన మతాన్ని ఆయన అవలం భించటానికి అభ్యంతరం లేదు ఎవరికైనా.
putta sudhakar yadav కోసం చిత్ర ఫలితం
ఐతే ఆయననను తీసుకొచ్చి హైందవ ధర్మక్షేత్రం తిరుమల తిరుపతి దెవస్థానం పాలకమండలి అధ్యక్షుణ్ని చేయటం అలాగే  క్రిష్టియన్ మతానికే చెందిన శాసనసభ్యురాలు అనితను పాలకమండలి సభ్యురాలిని చేయటానికి ప్రయత్నించిన వైనం తెలుగు దేశం ప్రభుత్వానికి హిందూ సమాజంతో కావలసినంత శత్రుత్వం తెచ్చిపెట్టాయి. ఇది రానున్న ఎన్నికల్లో చాపకింద నీరుల తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయకత్వానికి చరమ గీతం పాడే అంశాల్లో ప్రధాన పాత్ర వహించవచ్చు.
putta sudhakar yadav కోసం చిత్ర ఫలితం
కొత్త రాష్ట్రంలో 40పైగా హిందూ దేవాలయాలకు కూల్చివేసిన ఘనత మొఘలుల పాలన తరవాత టిడిపి పాలనలో మాత్రమే దేశవ్యాప్తం గా జరిగింది. అంతేకాదు టీడీపీ పాలన లో సామాన్యులకే కాదు, దేవుళ్లకూ రక్షణకరవైందని, దైవాపచారాలు నిరంతరం జరిగి పోతున్నాయని దీనిపై బహిరంగంగానే బ్రాహ్మణ ఐక్య వేదిక నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ అమ్మవారు, దుర్గగుడితో పాటు తిరుమలలో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనమన్నారు. 
putta sudhakar yadav కోసం చిత్ర ఫలితం

బ్రాహ్మణులలో ప్రత్యేకించి వైదికత్వం నెఱపే వారిపట్ల రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ తీరును నిరసిస్తూ బుధవారం విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ లోని ఆంజనేయ స్వామి ఆలయం నుంచి కనకదుర్గమ్మ ఆలయం వరకు బ్రాహ్మణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ జరిగింది. 
malladi vishnu images కోసం చిత్ర ఫలితం
ఈ సందర్భంగా ఐక్య వేదిక ప్రతినిధులు మాట్లాడుతూ, దుర్గగుడిలో తాంత్రిక పూజలు నిర్వహించడం, తిరుమల ఆలయంలో అపచారం జరగడం వంటి ఘటనలు హైందవ ధర్మం పై జరుగుతున్న దాడులకు నిదర్శనమన్నారు. ఇతరమతాల ప్రాభల్యాన్ని పెంచి అక్కడి ఆదాయాన్ని, సంపదను, సహస్రాబ్ధాలనుండి చక్రవర్తులు, రాజులు, సంపన్న పరులైన భక్త జనావళి ఇచ్చిన భూరి విరాళాలు, నవరత్న ఖచిత ప్రత్యేకించి వజ్రఖచిత ఆభరణాలను ఇప్పటికే తరలించి వేశారని దానిపై ఆ అన్యాయాన్ని ప్రశ్నించిన బ్రాహ్మణులను చంద్ర బాబు ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు.
putta sudhakar yadav కోసం చిత్ర ఫలితం
"వినాశకాలే విపరీత బుద్ధి" లాగా శ్రీవెంకతేశుని సంపద పై కన్నేసినా, ఆ దైవానికి అపచారం చేసినా ఆ వ్యక్తి కి పతనం ప్రారంభమై వినాశనం ఓ స్థాయిలో సంభవిస్తుందంటారు
TTD ornaments are at ap cms homes కోసం చిత్ర ఫలితం
తిరుమల ప్రతిష్టను మంట గలిపేలా తీసుకుంటున్న నిర్ణయాలు బాధ కలిగిస్తున్నాయని అన్నారు. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా శ్రీవారి కైంకర్యాలు నిర్వహించడం దారుణమన్నారు. తిరుమల కొండపై జరుగుతున్న తప్పులను ప్రశ్నించినందుకే ఆలయ ప్రధాన అర్చకులు  రమణ దీక్షితులను పదవి నుంచి తప్పించి కక్ష పగ సాధింపు చర్యలకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తిరుమల లో జరిగిన ఘటనలపై వెంటనే 'సీబీఐ' తో విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు.
TTD ornaments are at ap cms homes కోసం చిత్ర ఫలితం
అలాగే అర్చకుల సంక్షేమం కోసం విడుదల చేసిన జీవో 76ను తక్షణమే అమలు చేయాలన్నారు. పదవీ విరమణ వయసు నిర్ణయించి తొలగించడానికి అర్చకులేమీ ప్రభుత్వ ఉద్యోగులు కాదని, వారు హైందవ మత ప్రతినిధులని, టిటిడి హైందవ భక్తుల తోడ్పాటుతో సహస్రాబ్ధాలుగా వన్నెకెక్కిందని ప్రభుత్వానికెలాంటి సంభంధం లేదని గుర్తించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లా అక్కడ అర్చకులకు ఎలాంటి బెనిఫిట్స్‌ అంటే విశ్రాంత ఉద్యోగ ప్రయోజనాలు అందవన్నారు. 
TTD ornaments are at ap cms homes కోసం చిత్ర ఫలితం
కాగా, రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలకు వ్యతిరేకంగా విజయవాదలో బ్రాహ్మణ ఐక్యవేదిక చేపట్టిన ర్యాలీకి వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సంఘీభావం తెలిపారు. బ్రాహ్మణులు, అర్చకులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయా లు హేయమైనవని మండిపడ్డారు. అర్చకులపై కక్ష సాధింపు చర్యలను వెంటనే ఆపాలని మల్లాది విష్ణు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

TTD ornaments are at ap cms homes కోసం చిత్ర ఫలితం

ముఖ్యమంత్రి గృహాలకు శ్రీవారి ఆభరణాల తరలింపు విజయ సాయి దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు 

ఇది ఇలా ఉండగా బుధవారం విశాఖలోని వైసీపీ కార్యాలయంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ,  రాష్ట్ర ప్రజలకే కాదు, తిరుమల వెంకన్నకు కూడా చంద్రబాబు శఠగోపం పెట్టారని ధ్వజమెత్తారు. నాలుగేళ్ల పాటు రూ.మూడు లక్షల కోట్లు దోచి విదేశాల్లో ఆస్తులు కూడబెట్టుకున్న చంద్రబాబు, ఇక రాష్ట్రంలో దోచుకునేందుకు వనరులు లేకపోవడంతో శ్రీవారి ఆస్తులపై కన్ను వేశారని మండిపడ్డారు.


శ్రీవారి లడ్డూ పోటులో ఉన్న నేలమాళిగల్లోని గుప్త నిధులను ఎవ్వరికీ తెలియకుండా కొల్లగొట్టి ఇప్పటికే కొంత విదేశాలకు తరలించుకు పోయారన్నారు. స్విట్జర్లాండ్‌ లో కొన్ని ఆభరణాలను వేలానికి పెట్టారని, మరికొన్ని ఆభరణాలు, గుప్తనిధులను చంద్రబాబు తన నివాసం లో దాచిపెట్టుకున్నారని చెప్పారు. వెంకన్నకు అపచారం చేసిన వ్యక్తులు బాగుపడరని.. చంద్రబాబుకు కూడా అదే గతి పడుతుందని అన్నారు.

vijaya sai reddy కోసం చిత్ర ఫలితం

తిరుమల నేలమాళిగల్లోని విలువైన గుప్త నిధులు, వజ్రాభరణాలను సీఎం చంద్రబాబు అమరావతి, హైదరాబాద్‌ లోని తన నివాసాలకు తరలించుకుపోయాడని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. 12 గంటల్లోగా చంద్రబాబు నివాసాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) గానీ తెలంగాణ పోలీసులు గానీ దాడులు చేస్తే శ్రీవారి సొత్తు బయటపడుతుందన్నారు. చంద్రబాబు ఇంట్లో వెంకన్న సొమ్ము దొరక్కపోతే ఆ మరుక్షణమే తన పదవికి రాజీనామా చేస్తానని విజయసాయిరెడ్డి సవాల్‌ విసిరారు. 12గంటల్లోగా దాడులు చేయకపోతే వాటిని చంద్రబాబు విదేశాలకు తరలించే అవకాశాలున్నాయని ఆయన హెచ్చరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: