ఆది నారాయణ రెడ్డి వైసిపి నుంచి టీడీపీ లో కి ఫిరాయించి ఏకంగా మంత్రి కూడా అయి పోయాడు. అయితే కడప జిల్లాలో ఆది నారాయణ రెడ్డి కి రోజు రోజుకు శత్రువులు ఎక్కువ అయి పోతున్నారు. అయితే శత్రువులు ప్రతి పక్ష పార్టీ నుంచి కాదు స్వయంగా టీడీపీ నుంచే అని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరితో గొడవలు పెట్టుకుంటున్నాడు. దీనితో పార్టీ కు చెడ్డ పేరు వస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

Image result for adinarayana reddy

జిల్లా సంగ‌తిని ప‌క్క‌న‌పెడితే నియోజ‌క‌వ‌ర్గ‌మైన జ‌మ్మ‌ల‌మ‌డుగులోనే మంత్రికి బ‌ల‌మైన‌ ప్ర‌త్య‌ర్ధున్నారు. ఆవిర్భావం నుండి పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న రామ‌సుబ్బారెడ్డికి మంత్రికి ఉప్పు-నిప్ప‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. లో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ ను వ‌దిలేసిన ఆదినారాయ‌ణ రెడ్డి వైసిపిలో చేరారు. ఎన్నిక‌ల్లో రామ‌సుబ్బారెడ్డిని ఎదుర్కొని గెలిచారు. అయితే గెలిచిన కొంత కాలానికే వైసిపిలో నుండి టిడిపిలోకి ఫిరాయించారు.

Image result for adinarayana reddy

ఆది టిడిపిలోకి రావ‌టాన్ని రామ‌సుబ్బారెడ్డి తీవ్రంగా వ్య‌తిరేకించినా ఆప‌లేక‌పోయారు. దానికితోడు టిడిపిలోకి ఫిరాయించ‌ట‌మే కాకుండా ఆది నారాయ‌ణ‌రెడ్డి ఏకంగా మంత్రికూడా అయిపోయారు. దాంతో వారిద్ద‌రి మ‌ధ్య వివాదాలు ఎప్ప‌టిక‌ప్పుడు రోడ్డున ప‌డుతూనే ఉన్నాయి. వారిద్ద‌రి మ‌ధ్యా చంద్ర‌బాబు మ‌ధ్య‌స్ధం చేద్దామ‌ని ప్ర‌య‌త్నించినా సాధ్యం కావ‌టం లేదు.వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఫిరాయింపు మంత్రికి డిపాజిట్లు కూడా రాద‌ని వైసిపి నేత‌లంటున్నారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి వైసిపి అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌ల్లే ఆది గెలిచిన‌ట్లు వైసిపి నేత‌లు ఫిరాయింపు మంత్రిని ఎద్దేవా చేస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: