ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రత్యేక హోదా ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకుంటుందన్న సమయంలో ఒక్కసారే తిరుమల తిరుపతి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వ్యవహారం బయటకు వచ్చింది.  అయితే ఓ వైపు ప్రత్యేక హోదా ఉద్యమం కోసం ప్రజలు, నేతలు ముందుకు సాగుతుంటే..ఇదే సమయంలో రమణ దీక్షితులు వ్యవహారం చిలికి చిలికి గాలి వాన అవుతూ..రాజకీయ రంగు పులుముకుంటుంది.  ఈ వ్యవహారంపై ధర్మాదాయ మంత్రి కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు.   

ప్రత్యేక హోదా ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికే టీటీడీ వివాదాన్ని బీజేపీ తెరపైకి తెచ్చిందని ఉపముఖ్యమంత్రి, దేవదాయ, ధర్మాదాయ మంత్రి కేఈ కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.  మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు రాజకీయ ముసుగు వేసుకుని అలజడి సృష్టించాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు. ఆయన వెనుక బీజేపీ పెద్దలున్నారని విమర్శించారు.. వెళ్లి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాను, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలవడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
Image result for ttd ramana dekshitulu
‘2001లో వజ్రం పోయిందని రమణదీక్షితులు ఆరోపించారు. నిజంగా మైసూరు మహారాజు ఇచ్చిన ప్లాటినం హారంలోని వజ్రం కనబడకపోతే గత 17 ఏళ్లుగా ఎందుకు నోరు మెదపలేదు? 1996లో మిరాశీ వ్యవస్థను రద్దుచేసినప్పుడు మిరాశీదారులుగా ఉన్న రమణదీక్షితులు టీటీడీకి అప్పగించిన అన్ని నగలు భద్రంగానే ఉన్నాయని లిఖితపూర్వకంగా అంగీకరించారు ఆయన డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అంతే కాదు ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తీవ్రంగా విమర్శించారు.
Image result for ramana dekshitulu
ఏపీకి బ్రస్టు పట్టించడానికి కొన్ని రాజకీయ ఎత్తుల ఫలితమే ఈ రమణ దీక్షితులు అని వ్యాఖ్యానించారు.  తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడిగా తొలగించబడిన తరువాత రమణ దీక్షితులు చేస్తున్న విమర్శలపై టీటీడీ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఆలయ ప్రతిష్ఠను దిగజార్చేలా ఆయన మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ, ఉద్యోగులు మూకుమ్మడి నిరసనకు దిగారు. మూడు రోజుల పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని నిర్ణయించారు.  ఆయన కావాలనే ఇటువంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని టీటీడీ ఉద్యోగ సంఘం ప్రతినిధులు ప్రత్యారోపణలు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: