కొన్ని  దశాబ్దాల పాటు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం గడ్డు కాలం నెలకొంది. గతంలో 15 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం మూడు రాష్ట్రాలకు పరిమితం అయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా చతికిలపడింది ...ఈనేపధ్యంలోనే కాంగ్రెస్ పెద్దలు ఇతర రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ కార్యాలయాలకు డబ్బులు పంపడం మానేశారు.
Related image
అంతేకాకుండా ఖర్చులు కూడా తగ్గించుకోవాలి అని ప్రకటనలు కూడా చేశారట. దీన్ని బట్టి అర్థం అవుతుంది దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటో అని. అంతేకాకుండా పార్టీకి ప్రముఖుల నుండి వచ్చే విరాళాలు కూడా చాలా తగ్గిపోయాయని ఇటీవల లెక్కల ద్వారా అర్థమయింది. మరోపక్క అధికారంలో ఉన్న బిజెపి దూసుకెళ్ళిపోతున్న సంగతి మనకందరికీ తెలిసిందే..ప్రస్తుతం 20 రాష్ట్రాలలో అధికారంలో ఉంది.
Image result for CONGRESS
మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ఈసారి వచ్చిన విరాళాలు కూడా కాంగ్రెస్ పార్టీ కంటే చాలా ఎక్కువేనట అంతేకాకుండా గత ఏడాదితో పోలిస్తే  బీజేపీ విరాళాల్లో 81 శాతం పెరుగుదల ఉండగా.. కాంగ్రెస్ కు 14 శాతం తక్కువ విరాళాలు వచ్చాయి. కాంగ్రెస్ స్థితి ఎంత దయనీయంగా ఉందంటే.. డబ్బులు లేక విమాన టికెట్ బుక్ చేయడం ఆలస్యం కావడంతో ఓ సీనియర్ నేత సరైన సమయానికి ఓ ఈశాన్య రాష్ట్రానికి చేరుకోలేదట.
Related image
ఇక ఆయా రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్ కార్యాలయంలో వచ్చిన అతిథులకు కనీసం టీ ఇచ్చే పరిస్థితిలో కూడా లేవట..ఇటువంటి జాతీయపార్టీ కాంగ్రెస్ తో చంద్రబాబు దోస్తీ కడతానికి సిద్ధమవుతున్నారట. మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: