స్వైన్ ఫ్లూ.. ఎబోలా... జికా… ఇప్పుడు అదే తరహాలో మరో వైరస్ ఆందోళన కలిగిస్తోంది. దానిపేరు నిపా..  ఈ వైరస్ ఇప్పుడు కేరళ రాష్ట్రాన్ని భయపెడుతోంది. రెండు జిల్లాల పరిధిలో మూడు రోజుల వ్యవధిలోనే అక్కడ 10 మంది చనిపోయారు. దీంతో దక్షిణ భారతదేశం మొత్తం ఉలిక్కిపడింది. అయితే ఇది కొత్త వైరస్ కాదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Image result for nipah virus

నిపా.. ఈ వైరస్ పేరు చెబితే ఇప్పుడు కేరళ మొత్తం వణికిపోతోంది. అది శరీరంలోకి ప్రవేశించిందేమోన్నన భయం కోజికోడ్, మలపురం జిల్లాల ప్రజలు తీవ్ర అందోళన చెందతున్నారు. ఈ రెండు జిల్లాలో ఇప్పటికే ఈ వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు  ఈ వైరస్ బారిన పడి 10 మంది చనిపోయారు.  కోజికోడ్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు చనిపోయారు. బాదితులకు చికిత్స చేస్తున్న ఓ నర్స్ కూడా  ఈ వ్యాధి బారిన పడి చనిపోయింది. కేరళ నుంచి మొత్తం 12 శాంపిళ్లను పరీక్షలకు పంపగా అందులో 12 మందికి వైరస్ పాజిటివ్ అని తేలింది. వీరిలో 10 మంది ఇప్పటికే చనిపోయారు. ప్రధానంగా గబ్బిలాలు, పందుల నుంచి ఈ వైరస్ వ్యాపిస్తున్నట్టు  గుర్తించారు.  దక్షిణ భారతదేశంలో  వైరస్ కనిపిండం ఇదే మొదటిసారి. గబ్బిలాలు కొరికిన పండ్లు మనుషులు తినడం లేదా,  పంది మాసం తినడం ద్వారా ఈ వైరస్  మనుషులకు వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. పందుల సంరక్షకులకు కూడా ఈ వైరస్ పెద్ద ముప్పే.

Image result for nipah virus

వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కొన్ని గంటల్లో జ్వరం, తలనొప్పి తీవ్రమవుతాయి.ఆ తర్వాత శ్వాసకోస ఇబ్బందులు తీవ్రమవుతాయి. ఆ తర్వాత ఈ వైరస్ మెదడులోకి ప్రవేశించి.. మెదడు వాపుకి దారితీస్తుంది.  వెంటనే చికిత్స అందకపోతే రోగి కోమాలోకి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ప్రాణాలు కోల్పోతాడు.  దీనికి ప్రత్యేక చికిత్స అంటూ ఏమీ లేదు. ముందే జాగ్రత్తపడకపోతే ప్రాణాలు పోయే  ముప్పు ఉంది.  ఇది జంతువుల నుంచి సంక్రమించే వైరస్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ కి సంబంధిం  ప్రపంచ ఆరోగ్య సంస్థ కేరళను అప్రమత్తం చేసింది. కేంద్రమంత్రి జె.పి. నడ్డా వెంటనే కేరళ ఆరోగ్యశాఖ మంత్రితో మాట్లాడారు. ఓ ప్రత్యేక టీమ్ ను కేరళకు పంపించారు. ఎన్సీడీసీ డెరెక్టర్ ను కేరళ వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని ఆయన ఆదేశించారు.  ఇది కూడా ఒకరకమైన ఎన్ సఫలైటిస్ అని మెడికల్ అధికారులు చెబుతున్నారు.  ఇది మెదడువాపుగా మారితే మాత్రం పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ ను గుర్తించాలంటే శాంపిళ్లను పుణెలోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపి పరీక్షలు చేయించుకోవాల్సిందే.

Image result for nipah virus

నిపా వైరస్ ను తొలిసారిగా 1998లో మలేషియాలో నిపా ప్రాంతంలో గుర్తించారు.  ఆ ప్రాంతం పేరుతో దీనికి ఆ పేరును పెట్టారు. అప్పట్లో ఈ వాధి బారిన పడి 105 మంది చనిపోయారు.  తర్వాత ఇది సింగపూర్ లో కనిపించింది. 2004లో బంగ్లాదేశ్ ను నిపా వణికించింది. ఈ వైరస్ దెబ్బకు వందలాది మంది చనిపోయారు. మనదేశంలో తొలిసారిగా  ఈ వైరస్ పశ్చిమబెంగాల్ లోకినిపంచింది. ఇంత వరకు దక్షిణ భారతదేశంలో ఎక్కడ కనిపించలేదు. తొలిసారిగా కేరళలో కలకలం సృష్టిస్తోంది. మనిషి నుంచి మనిషికి వ్యాపించే అవకాశం ఉండటమే అత్యంత ప్రమాదకరంగా మారింది. ఇంట్లో ఎవరైనా మూడు రోజలుకు మించి జ్వరంతో బాధపడుతున్నా.. రోజు రోజుకి పరిస్థితి దిగజారుతున్నా వెంటనే అస్పత్రితో చేర్పించాలని ప్రారంభంలో వ్యాధిని గుర్తిస్తే నయం చేయడం కష్టమేంకాదని డాక్టర్లు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: