2019 ఎన్నికలే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించిన ‘పోరాట యాత్ర’ కు బ్రేక్ పడింది. మే 20న శ్రీకాకుళం జిల్లా ఇచ్భాపురంలో ప్రారంభమైన ఈయాత్ర 45 రోజులపాటు కొనసాగుతుంది అని మొదట్లో ప్రకటించారు. అయితే ఈయాత్ర ప్రారంభించి కనీసం వారంరోజులు కూడ పూర్తి కాకుండానే బ్రేక్ పడటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. తగినంత మంది భద్రతా సిబ్బంది లేకపోవడంతో ఈరోజు పవన్ పోరాట యాత్ర ఆగిపోయింది అని ప్రకటించారు. ఈరోజు పవన్ శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి సమీపంలోనే ఈ రోజంతా ఒక రిసార్ట్ లో ఉంటున్నట్లు సమాచారం. 
పవన్ కళ్యాణ్ లేకుండానే గెలిచాం
పవన్ పర్యటనకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కనీస భద్రత కూడ ఏర్పాటు చేయకపోవడంతో   పవన్ తన సొంత భద్రాతా సిబ్బందితోనే ఈపర్యటనను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే పవన్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో చాలమంది జనం తాకిడికి తీవ్రంగా గాయపడిన నేపధ్యంలో   వారుకోలుకునే విధంగా పవన్ తన యాత్రకు ఇలా బ్రేక్వేసినట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు పవన్  ప్రస్తుతం ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురంలోని ఓ రిసార్ట్స్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కు అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండటంతో భద్రతా కారణాల దృష్ట్యా రిసార్ట్స్‌లోఉన్నట్లు తెలుస్తోంది.  
తెలుసుకొని మాట్లాడాలి
ఇది ఇలా ఉండగా మొన్న పవన్ బస చేసిన కళ్యాణ మండపంలో అర్థరాత్రి కరెంట్ తీసేసి పవన్ కు అసౌకర్యం కలిగించిన సంఘటన సంచనలంగా మారింది. గత కొద్దిరోజులు గా పవన్ కొనసాగిస్తున్న పోరాట యాత్రాలో పవన్ అభిమానులకు వ్యక్తిగత భద్రతా సిబ్బందికి మధ్య తరుచు భారీగా తోపులాట జరుగుతూ ఉండటంతో పాటు కొంతమంది అభిమానులతో పాటు పవన్ వ్యక్తిగత సిబ్బందికి కూడా దెబ్బలు తగులుతున్న పరిస్థితులలో పవన్ తన పోరాటయాత్రలో తన పట్టును కోల్పోతున్నాడా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

మొదటి విడతలో 45 రోజులపాటు జరగా బోతున్న ఈయాత్ర అప్పుడే బ్రేక్ పడటం గమనించిన వారు  పవన్ ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజక వర్గాల్లో పర్యటించగలడా? అన్న సందేహాలు వ్యక్త పరుస్తున్నారు.  దీనికితోడు పవన్ కళ్యాణ్ రోజుకో మాట పూటకో మాట మాట్లుడుతూ ప్రజల్లో చులకన అవుతున్నాడని రాజకీయ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ పరిస్థితులలో రాబోతున్న ఎన్నికలలో పవన్ ‘జనసేన’ ఓట్లు చీల్చడానికి ఉపయోగ పడుతుంది కాని అధికారాన్ని అందుకోవడానికి పవన్ వ్యూహాలు సరిపోవు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: