కల్వకుంట్ల తారక రామారావు.. నందమూరి తారక రామారావు.. ఇద్దరి ఇంటిపేర్లు వేరయినా పేరు మాత్రం ఒక్కటే.! తారక రామారావు పేరు పెట్టుకున్న కేటీఆర్ కుటుంబానికి, ఎన్టీఆర్ కుటుంబంతో ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఎన్టీఆర్ పిలుపుమేరకు రాజకీయాల్లోకి వచ్చిన కేసీఆర్.. ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగి తెలంగాణ పితగా ఎదిగారు. ఇప్పటికీ ఎన్టీఆర్ అంటే కేసీఆర్ కు ఎంతో అభిమానం.

Image result for ktr and senior ntr

          తెలుగుదేశం పార్టీ నుంచి బయటికొచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు కేసీఆర్. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానించే కేసీఆర్.. తన కుమారుడికి తారక రామారావు అని పేరు పెట్టుకున్న విషయం తెలిసిందే. పలు సందర్భాల్లో అటు కేసీఆర్, ఇటు కేటీఆర్ ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పుకొచ్చారు.

Image result for kcr and senior ntr

          తాజాగా.. కేటీఆర్ మరోసారి ఎన్టీఆర్ పై అభిమానం చూపించారు. బసవతారకం ఆసుపత్రిలో బీఎంటీ యూనిట్ ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఆసుపత్రి ఛైర్మన్ బాలకృష్ణ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు ఈ సందర్భంగా కేటీఆర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. తనకు తారక రామారావు పేరు పెట్టడం వెనుక కథ చెప్పుకొచ్చారు. ఆయన మహనీయుడని, అందుకే నాకు ఆ పేరు పెట్టారని గుర్తు చేశారు. అంతేకాదు.. ఆ మహనీయుడి పేరు పెట్టుకున్నందుకు ఆయనకు తలవంపులు తెచ్చే పనులేవీ చేయనని మాటిచ్చారు.

Image result for ktr at basavatarakam hospital

హీరో బాలకృష్ణపై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. తనకిష్టమైన హీరో బాలకృష్ణ అన్నారు.. బసవతారకం ఆసుపత్రి ద్వారా రోగులకు సేవ చేస్తున్న బాలకృష్ణ ఎంతో మేలు చేస్తున్నారన్నారు. రోగుల సౌకర్యార్థం అవసరమైతే ప్రభుత్వం ఆసుపత్రిలో ప్రత్యేక షెడ్ లు ఏర్పాటు చేస్తుందన్నారు. కేటీఆర్ పై బాలకృష్ణ కూడా ప్రశంసలు కురిపించారు. తన తండ్రి ఎన్టీఆర్ పేరు పెట్టుకున్న కేటీఆర్ చేతుల మీదుగా ఈ యూనిట్ ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. ఇలా.. ఎన్టీఆర్ స్మరణలో మునిగిపోయారు కేటీఆర్, బాలయ్య..!


మరింత సమాచారం తెలుసుకోండి: