ఇప్పుడు సోషల్ మీడియాలో ఫిట్ నెస్ ఛాలెంజ్ బాగా ట్రెండింగ్ లో ఉంది. కేంద్రమంత్రి, షూటింగ్ కింగ్ అయిన రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్.. అందరిలో ఫిట్ నెస్ పై ఇంట్రస్ట్ పెంచే ఛాలెంజ్ తీసుకొచ్చారు. ట్విట్టర్ లో తాను ఎక్సర్ సైజ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసిన రాజ్యవర్థన్.. ఫిట్ నెస్ ఛాలెంజ్ ను కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, బ్యాడ్మింటన్ స్టార్ కు విసిరాడు. హమ్ ఫిట్ హై తో ఇండియా హిట్ నినాదంతో రాజ్యవర్థన్ చేసిన ఛాలెంజ్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్సే వస్తోంది. రాజ్యవర్థన్ ఛాలెంజ్ ను స్వీకరించిన కోహ్లీ.. స్పైడర్ ప్లాంక్ చేసిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అంతేకాదు.. తాను ఛాలెంజ్ ను పూర్తి చేశానని.. ఈ ఛాలెంజ్ ను స్వీకరించాలని.. ప్రధాని మోడీ, మిస్టర్ కూల్ ధోనీతో పాటు తన భార్యకు కూడా సవాల్ విసిరాడు. 

Image result for fitness challenge

కోహ్లీ ఛాలెంజ్ ను ప్రధాని మోదీ స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే తన ఫిట్ నెస్ వీడియోను పోస్టు చేస్తానని చెప్పారు. దీంతో మోదీకి ఛాలెంజ్ విసిరే వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పెట్రో ధరలు తగ్గించాల్సిందిగా సవాల్ విసిరారు. లేకుంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేస్తుందని హెచ్చరించారు.

Image result for fitness challenge

ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. అయితే ఇది ఫిట్ నెస్ ఛాలెంజ్ కాదు.. యువతకు ఉద్యోగాలు కల్పించాలని, రైతులకు ఊరట కల్పించాలని, దళితులు మైనారిటీలపై హింస జరగకుండా ఉండేలా ఛాలెంజ్ స్వీకరించాలని తేజస్వీ యాదవ్ కోరారు. మరోవైపు కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా కూడా ఇలాంటి ఛాలెంజే విసిరారు. నాలుగేళ్లుగై ఎక్సైజ్ సుంకం రూపంలో వసూల్ చేసిన రూ.10 లక్షల కోట్లను పెట్రో ధరల తగ్గించేందుకు ఉపయోగిస్తారా.. అని ఛాలెంజ్ చేశారు.

Image result for fitness challenge

ఇక రాజ్యవర్ధన్ ట్వీట్ కు బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కూడా స్వీకరించింది. తాను ఎక్సర్ సైజ్ చేస్తున్న వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సైనా.. రాజ్యవర్థన్ కు థ్యాంక్స్ కూడా చెప్పింది. ఇదే చాలెంజ్ ను రానా దగ్గుబాటి, పీవీ సింధు, గౌతమ్ గంభీర్ కు విసిరింది. సైనా ఛాలెంజ్ ను స్వీకరించిన సింధు.. కూడా తన వర్కవుట్ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసుకుంది. తాను ఛాలెంజ్ ను పూర్తి చేశానంటూనే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణు. అఖిల్ అక్కినేనికి ఛాలెంజ్ స్వీకరించాలంటూ సవాల్ విసిరింది. సింధు ఛాలెంజ్ ను స్వీకరించిన అఖిల్ తన వర్కవుట్ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. తన ఛాలెంజ్ ను స్వీకరించాలని నాగార్జున, నాగచైతన్య తోపాటు వరుణ్ ధావన్, దుల్కర్ సల్మాన్ కు సూచించాడు. మరోవైపు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఫిట్ నెస్ ఛాలెంజ్ ను హృతిక్ వెరైటీగా స్వీకరించాడు. జిమ్ లో వర్కవుట్ల కంటే.. సైక్లింగ్ బెస్ట్ అంటూ తాను సైక్లింగ్ చేస్తూ తీసిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశాడు.

 Image result for fitness challenge

మొత్తానికి ఫిట్ నెస్ ఛాలెంజ్ సోషల్ మీడియాలో వైరల్ మారింది. సెలబ్రిటీల పుణ్యమా అని.. ట్విట్టర్ లో ఇప్పుడిది ట్రెండింగ్ అవుతోంది. సామాన్యులు కూడా సెలబ్రిటీల దారిలో ఫిట్ నెస్ ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నారు. హమ్ ఫిట్ తో ఇండియా హిట్ అంటున్నారు. మొత్తానికి ఇప్పుడు ఈ ఛాలెంజ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: