బాబాయే అనుకుంటే అబ్బాయ్ కూడా తయారవుతున్నాడు. అదేనండి పవన్ కల్యాణ్ అనుమతిస్తే ప్రచారానికి రెఢీ అంటూ రామ్ చరణ్ ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం చేయటానికి తాను సిద్ధమంటూ రామ్ చరణ తెలిపారు. జనసేన తరపున ప్రచారం చేయటానికి రామ్ చరణ్ కున్న అర్హత ఏమిటంటారా ? ప్రజారాజ్యం స్ధాపించి రెండేళ్ళు కాకుండానే కాంగ్రెస్ లో విలీనం చేసేసిన మెగాస్టార్ చిరంజీవి కొడుకు మాత్రమే. అంతకుమించి చరణ్ కున్న అర్హతలేంటో ఎవరికీ తెలీదు. అప్పట్లో ప్రజారాజ్యం తరపునే ప్రచారం చేద్దామనుకున్నాడట. కాకపోతే అప్పట్లో యువరాజ్యం అధ్యక్షుడుగా ఉన్న పవన్ వద్దని ఆపేసారని తెగ బాధపడిపోతున్నారు.

బాబాయ్ మాటే అర్ధం కాదు..ఇక అబ్బాయ్ కూడానా ?
అసలు పవన్ కల్యాణ్ చెప్పేదే ఎవరికీ అర్ధమవటం లేదు. ఎందుకంటే, తానేం చెబుతున్నారో పవన్ కే అర్ధం కాదు. ఒకసారి చెప్పింది ఇంకోసారి చెప్పరు. ముందు చెప్పినదానికి భిన్నంగా తర్వాత పవన్ చెప్పటం ఎన్నోసార్లు అనుభవమే. అధికారం అందుకోవటానికి తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. తనకు పవర్ అవసరం లేదని ఎన్నోసార్లు చెప్పారు. ప్రజలకు సేవ చేయాలంటే అధికారమే ఉండాలా అని ఊరూ వాడా తిరిగినపుడు ప్రశ్నించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇపుడేమో అధికారం లేకపోతే ఏమీ చేయలేనని అంటున్నారు. ప్రజలు తనకు అధికారం అప్పగిస్తే సేవ చేసుకుంటానని చెబుతున్నారు. అంటే, ఎప్పుడేం చెబుతారో పవన్ కే తెలీదు. అందుకనే ఓట్లు లేని ఆయన అభిమానులు తప్ప ఇంకెవరూ పెద్దగా సీరియస్ గా పట్టించుకున్న దాఖలాలు లేవు. అటువంటిది అబ్బాయ్ కూడా ప్రచారానికి సిద్ధమంటున్నారు. రేపటి ఎన్నికల్లో ప్రచారానికి బాబాయ్ కలిస్తే అబ్బాయ్ కలసి వస్తే ఎలా ఉంటుందో కళ్ళారా చూడాల్సిందే.

5/
5 -
(1 votes)
Add To Favourite