ఇంతక ముందు పవన్ కళ్యాణ్ ఏదైనా సమస్య మీద మాట్లాడితే చంద్ర బాబు అండ్ కో ఆఘ మేఘాల మీద వాలిపోయేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు పవన్ కళ్యాణ్ టీడీపీ మీద విమర్శలు చేయడం తో టీడీపీ కూడా పవన్ కళ్యాణ్ మీద యూ టర్న్ తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ డిమాండ్ లను అస్సలు పట్టించుకొనే పరిస్థితి లో లేదు. చంద్ర బాబు మరో 48 గంటల్లో స్పందించకుంటే ఆమరణ దీక్ష కు దిగుతా అని పవన్ కళ్యాణ్ హెచ్చరించాడు. 

Image result for chandrababu naidu and pawan kalyan

అలా ప్రకటించిన వెంటనే.. ఆయనకు యాత్రనుంచి గ్యాప్ తీసుకోవడం కూడా సాధ్యమైంది. పవన్ వ్యక్తిగత సిబ్బందికి గాయాలయ్యాయని, పోలీసు భద్రతను కల్పించడం లేదని సాకులు చెప్పి.. పవన్ ఒక రోజు రెస్టు తీసుకున్నారు. నిజానికి ప్రకటించిన ప్రకారం అయితే శుక్రవారం యాత్ర తిరిగి మొదలు కావాలి. కానీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇంకా సిద్ధం కాలేదంటూ.. శుక్రవారం యాత్రను కూడా రద్దు చేశారు.

Image result for chandrababu naidu and pawan kalyan

అయితే.. ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని 48గంటల్లోగా నియమించాలనే తన డిమాండ్ పట్ల ఎలా స్పందిస్తారో చూసుకుని... ఆ తర్వాత యాత్ర కొనసాగించే విషయంలో నిర్ణయం తీసుకోవాలని పవన్ కోటరీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే చంద్రబాబు దీనిని పట్టించుకున్నట్లుగా లేదు. ఆయన వైద్యశాఖ అధికార్లతో సమీక్ష సమావేశం నిర్వహించి.. ఉద్ధానం సమస్య విషయంలో తమ ప్రభుత్వం ఎంత అద్భుతంగా స్పందిస్తున్నదో నివేదించేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: