ప్రస్తుత ఆంధ్రరాజకీయాలలో మోస్ట్ సీనియర్ రాజకీయ నాయకుడంటేనే సంశయించకుండా మొదటగా గుర్తొచ్చే పేరు చంద్రబాబు నాయుడు. ఆయన అమలు చేసే వ్యూహాలు, వేసే పై ఎత్తులే ఆయనను రాష్ట్రంలో నిలదొక్కొని ఇంకా అధికారం చేపట్టేలా చేస్తున్నాయంటే సందేహం లేదు. ఏదో చేస్తారని గత ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే చివరికి కుచ్చుటోపీ పెట్టడంతో వారితో పొత్తు విరమించుకున్నాడు.


అయితే త్వరలొనే ఎన్నికలు రానున్నడంతో  ఆయన ఇప్పుడు మళ్లీ జాతీయస్థాయిలో ఒక పార్టీతో పెట్టుకోవడానికి యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. యూపీఏతో పొత్తుకు సంబంధించి కార్యకలాపాలు జరుగుతున్నాయని వినికిడి. అంతేకాకుండా మొన్న జరిగిన కుమారస్వామి ప్రమాణస్వీకారానికి బాబు వెళ్ళడం, అక్కడితో ఆగకుండా యూపీఏ అధినేత రాహుల్ ను భుజం తట్టి మరీ మాట్లాడంటం ఇవన్నీ చూస్తుంటే రానున్న రోజుల్లో పొత్తు ప్రకటించే సూచనలే కనిపిస్తున్నాయి. బాబు చేసిన చేష్టలే కాకుండా ఇప్పుడు ఆయన కొడుకు, మంత్రి నారా లోకేష్ చేసిన వాఖ్యలు కూడా కాంగ్రెస్ పొత్తుకు ఆజ్యం పోసేలా ఉన్నాయి.

నిన్న విజయవాడ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన ఏపీకి అన్యాయం చేసిన బీజేపీ గురించి విమర్శిస్తూ రానున్న ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేఖమయిన పార్టీలతో కలిసి పనిచేస్తామని తెలిపాడు. కేంద్రంలో ఎన్డీయే తరువాత ఉన్న ఒక్క పెద్ద కూటమి యూపీఏనే. కేసీఆర్ మూడవ కూటమికి  సన్నాహకాలు చేస్తున్నా బాబు మద్దతిచ్చే దాఖలాలు కనిపించడంలేదు. కాబట్టి యూపీఏ అని తెలపకుండా పరోక్షంగా బీజేపీ వ్యతిరేఖ పార్టీ అంటూ తెలిపి పొత్తు గురించి తేల్చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: