కర్నాటకలో కుమారస్వామి ప్రభుత్వం కొలువుదీరింది. మొన్నే ప్రమాణస్వీకారం చేసినా.. ఇవాళ బలపరీక్షలో నెగ్గడంతో పాలన పట్టాలెక్కినట్లయింది. బీజేపీని గద్దెనెక్కించకూడదన్న కోరికైతే నెరవేరింది కానీ వీళ్ల కింద ముళ్లపానుపు ఉందన్న విషయం ఇప్పడు తెలియకపోవచ్చు. ఈ కూటమి ఎంతకాలం మనగలుగుతుందోననే అనుమానం బయటివారికే కాదు.. కాంగ్రెస్ – జేడీఎస్ ల్లోనూ కలుగుతోంది.

Image result for kumaraswamy

          కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, జేడీఎస్ కుటుంబంలో ఆధిపత్యపోరు.. ఈ సంకీర్ణ సర్కార్ ను ఏ తీరాలకు చేరుస్తాయోననే అనుమానాలు బలంగా ఉన్నాయి. సాక్షాత్తూ బీజేపీ పక్షనేత, ప్రతిపక్ష నేత యడ్యూరప్ప ఇదే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. కుమారస్వామిని నమ్మొద్దని కాంగ్రెస్ కు హెచ్చరించారు. అలాగే కాంగ్రెస్ లో కీలక నేత డి.కె.శివకుమార్ కు ముఖ్యమంత్రిపీఠం ఎక్కే ఛాన్స్ ఎన్నటికీ రాదని హెచ్చరించారు. నాడు కుమారస్వామితో తనకు ఎదురైన అనుభవాలను గుర్తు చేశారు. నమ్మకద్రోహిగా అభివర్ణించారు.

Image result for kumaraswamy

యడ్యూరప్ప చెప్పిన విషయాలను పక్కనపెడితే కాంగ్రెస్ లో పదవుల పందేరంపై అస్పష్టత నెలకొంది. తమకు ఎక్కువ సీట్లు వచ్చినా తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్ కు ముఖ్యమంత్రి పీఠం అప్పగించాల్సి రావడం ఆ పార్టీకి మింగుడు పడడంలేదు. కాంగ్రెస్ లోని చాలా మంది నేతలు ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ సభ్యులను కంటికి రెప్పలా కాపాడుకున్న డి.కె.శివకుమార్ తనకు ఉపముఖ్యమంత్రి పీఠమైనా దక్కుతుందని ఆశించారు. అయితే ఆయనకు ఆ కోరిక నెరవేరలేదు. దీంతో ఆయన వర్గీయుల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఇక జేడీఎస్ లో కుమ్ములాటలు కొత్తకాదు. కుమారస్వామి సోదరుడు రేవణ్ణకు పదవీకాంక్ష ఉంది. ఆయనకు 12 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందనే ప్రచారం జరుగుతోంది. రేవణ్ణ వర్గీయులను చీల్చి ముఖ్యమంత్రిపీఠం దక్కించుకోవాలని ప్రయత్నించింది. అయితే కుదరలేదు.

Related image

కాంగ్రెస్ – జేడీఎస్ నేతలను సంతృప్తి పరుచుకుంటూ.. వారి కోర్కెలు తీర్చుకుంటూ పాలన సాగించడం ఆషామాషీ విషయం కాదు. రోజూ గగనమే.! పైగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసిన ప్రాంతానికి ఓ సెంటిమెంట్ ఉందని అక్కడి నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ ముందు భాగంలో వేదిక ఏర్పాటు చేసి.. అక్కడ ప్రమాణం స్వీకారం చేసిన వాళ్లు ఎవ్వరూ 5 ఏళ్ల పరిపాలన పూర్తి చేయలేదు. ఇదే సెంటిమెంట్ కుమార్వసామి విషయంలో పనిచేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి కుమారస్వామి ఏం చేస్తారో..?


మరింత సమాచారం తెలుసుకోండి: