తెలుగుదేశం పార్టీ అధినేత ఒకప్పుడు దక్షిణ భారతంలోనే అతిపెద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధినేత ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు చెప్పాలంటే 13జిల్లాల చిన్న రాష్ట్రానికి మాత్రమే ముఖ్యమంత్రి. నిజంగా చెప్పాలంటే ఆయన స్థాయి తగ్గింది. అయితే ఆయన ప్రతిరోజూ ప్రతి మీటింగులో సందర్భం దొరికిన ప్రతిచోటా "ఆత్మ స్తుతి" (సెల్ఫ్ డబ్బా) భరించలేననతగా పెరిగిపోయింది. ఇప్పుడు ప్రజల మద్యలో చాలా ఎక్కువగా వినిపించే చర్చ కూడా ఇదే.  


ప్రజలు నవ్వుకుంటున్నారు, శత్రువులు, ప్రతిపక్షాలు విపరీతంగా ఎగతాళి చేస్తున్నా ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకుండా చంద్ర బాబు, తన గొప్పతనాన్ని  ఉన్నవీ లేనివీ, తనవి కానివి కలిపి తన ఖాతాలో వేసేసుకుంటూ తనకు సంబంధించిన ఘనతలను చెప్పుకుంటున్నట్లు వారి పార్టీ వాళ్ళైతే గుసగుసలుగా చెప్పుకోవటం విని పిస్తున్నాయి. 
chandrababu self dabba కోసం చిత్ర ఫలితం
ఆయనకు సహజంగా స్వకుచమర్ధనం అందరికన్నా ఎక్కువే. అయితే గతంలో ఇంతగా లేకున్నా, ఇటీవలి చంద్రబాబుకు ఈ తరహా ప్రసంగాలు ప్రచారార్భాటాలు బాగా ఎక్కువై అలవాటై అదొక వ్యసనంగా మారి అలా చెప్పుకోకపోతే బ్రతుకు లేదన్నంతగా మారిపోయింది. ప్రతి ఉపన్యాసములో 70% తన గొప్పతనాన్ని గుఱించే. 20% నరెంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టటం మిగతాది వైసిపి జగన్ను తిట్టటం తో సరిపోతుంది. 
chandrababu self dabba కోసం చిత్ర ఫలితం
అయితే ఒంటిపై సోయిలేకుండా స్వకుచ మర్ధనం చేసుకునే సమయంలో ఏకంగా ప్రధానమంత్రి పదవి తనను వరించి వస్తే, తానే రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం అంత అత్యున్నత పదవిని వదిలేసినట్లు ఆయన గొప్పలు చెపుతూ పోయారు. ప్రధాని పదవి ఒకసారి మాత్రమే కాదని రెండు సార్లు తనను వరించి వచ్చిందని అయితే తానే తృణప్రాయంగా రెండు సార్లూ తిరస్కరించానని కూడా చంద్రబాబు చెప్పుకున్నారు. ప్రతిరోజూ వినే జనాలకు వినిపించే పచ్చ చానల్స్ ను ఈ మద్య ఈయన ప్రసంగం మొదలవగానే కట్టేయటమో మ్యూట్ చేయటం చెస్తున్న సందర్భాలను గమనిస్తున్నాం.  
chandrababu self dabba కోసం చిత్ర ఫలితం
అయితే ఆయనకు ప్రధాని పదవిని ఎవరు ఆఫర్ చేశారో తెలియదు, కాని ఆయన ఆత్మ స్తుతి ప్రసంగాల్లోని నిజానిజాలెంత అనే విషయాన్ని తేల్చిపారేసేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఇప్పుడు రంగంలోకి దిగిపోయారు. 

కాసేపటి క్రితం మీడియా తో మాట్లాడిన జీవీఎల్, చంద్రబాబు గొప్పలపై తన దైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. అసలు చంద్రబాబుకు ప్రధాని పదవిని ఆఫర్ చేసిందెవరు? అని జీవీఎల్ కాస్తంత సూటిగానే ప్రశ్నించారు. చంద్రబాబును ప్రధానిని చేస్తామని ఏ ఒక్క జాతీయ నేతా ప్రతిపాదించలేదని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. వాజపేయి కష్టాలు చూసి "తుమ్మితే ఊడిపోయే పదవి" అని ఆరోజుల్లో చంద్రబాబే ఆ ప్రధాని పదవికి దూరంగా ఉండి పోయారని, ఆ విషయాన్ని ఇప్పుడేమో ప్రధాని పదవిని తాను త్యాగం చేసినట్టు ఫోజులు కొడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు తాజాగా పగటి కలలు కంటున్నారని జీవీఎల్ ఎద్దేవా చేశారు. 
chandrababu self dabba కోసం చిత్ర ఫలితం
రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ధర్మపోరాటం అంటూ సభలు పెట్టడాన్ని జీవీఎల్ తీవ్రంగా నిరసించారు. అసలే నిధుల కొరతతో అలమటించే కొత్త రాష్ట్ర ప్రభుత్వ నిధులతో టిడిపి సభలు పెడితే ప్రజలు చూస్తూ ఎంతోకాలం ఊరుకోబోరని హెచ్చరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ను రాజకీయ వ్యవస్థగా మార్చాలని చూస్తున్నారని అన్నారు. 
chandrababu self dabba about PM post offer కోసం చిత్ర ఫలితం
అర్చకులను తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడూ లేదన్నారు. అర్చకులను తొలగించి నందుకు చంద్రబాబు లెంపలేసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి ఆభరణాల మాయం పై విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారు? అని ఆయన ప్రశ్నించారు. లక్షల కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు ఏమయ్యాయో? ప్రజలకు వెల్లడించాలని జీవీఎల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతటితో సరిపెట్టని జీవీఎల్, రెండంటే రెండు ఎకరాల భూమి ఉన్న చంద్రబాబు, ఇప్పుడు దేశంలోని అత్యంత సంపన్నుడు ఐన సీఎంగా ఎలా రూపాంతరం చెందారు? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా చంద్రబాబును టార్గెట్ చేసుకుని జీవీఎల్ చేసిన ప్రస్తుత వ్యాఖ్యలు సామాజిక మాద్యమంలో కూడా వైరల్ గా మారిపోయాయి. 
chandrababu self dabba about PM post offer కోసం చిత్ర ఫలితం

ప్రధాని పదవిని త్యాగం చేసినట్లు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధి కూడా ఇలాగే టముకు వేసుకునేవారని, (వారి అభిమానులు కూడా) ఒక సంధర్భంలో ఆమె ప్రతిష్ఠ కే ప్రమాదం ఏర్పడినట్లు —  చంద్రబాబు గుర్తిస్తే మంచిది. ఆయనకు టముకేసే పచ్చ తెలుగు మీడియా తప్ప - ఏ పార్టీతో పొత్తులేకుండా,  అప్పుడు  సమైఖ్య ఆంధ్రప్రదేశ్ లోగాని - ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో గాని గెలిచే సత్తా ఆయనకు లేకే గత రెండు నెలలుగా కర్ణాటక చడ్డీ పట్టుకొని, ఏపి పాలన గాలికి ధూళికి వదిలేసి, చెట్టూ పుట్టా వెంబటి తిరుగుతూ కాలం గడిపేస్తున్నారని జనంలో చతురోక్తులు అంటే సెటైర్లు పేలిపోతున్నాయి.   


అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసింది నేనే, ఇద్దర్ని ప్రధానుల్ని చేసింది నేనే, కర్ణాటకలో బీజేపీని అధికారానికి దూరం చేసింది నేనే

అన్నీ నేనే కట్టానంటూ, నేనే చేశానంటూ ఇలా మినిమం గ్యాప్ లో సొంత డబ్బా కొట్టుకోవడం చంద్రబాబు హాబీ. కానీ ఈసారి ఈ "నేనే" అనే అతి మరింత పీక్స్ కు చేరింది, ఎంతలా అంటే చివరికి బేగంపేట విమానాశ్రయాన్ని కట్టింది కూడా నేనే అంటూ తనకు తాను ప్రకటించేసుకున్నారు చంద్రబాబు. దీంతో అంతా అవాక్కయ్యారు. కొందరు ఫక్కున నవ్వారు.

మరింత సమాచారం తెలుసుకోండి: